రక్తం మరుగుతున్నది.. ‘చైనా‘ను బాయ్‌కాట్.. వీర జవాన్లకు టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

భారత, చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగడంతో 20 మంది భారత సైనికలుు వీర మరణం పొందడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ కాల్పుల్లో తెలుగు జవాను కల్నల్ బీ సంతోష్ బాబు మరణించడం అందర్నీ కలిచివేస్తున్నది. సంతోష్ బాబు సూర్యపేట జిల్లాకు చెందిన వారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంతోష్ బాబు మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి గురయ్యారు. దేశ సేవ కోసం ప్రాణాలర్పించిన వీరుడు సంతోష్‌బాబుకు సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో సంతాప ప్రకటనలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

#IndiaChinaFaceOff : 20 మంది Indian Soldiers వీర మరణం పై సినీ ప్రముఖుల సంతాపం!
మహేష్ బాబు ఉద్వేగంతో

మహేష్ బాబు ఉద్వేగంతో

గల్వాన్ వ్యాలీలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారనే వార్తతో విషాదంలో మునిగిపోయాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. వీర జవాన్ల త్యాగాలను ఈ దేశ ప్రజలు ఎన్నటికీ గుర్తుంచుకొంటారు. వెలకట్టలేని మీ సేవలు మా గుండెల్లో ఉంటాయి. మీ దేశభక్తికి, ధైర్య సాహసాలకు మా సెల్యూట్. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాంపం అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 నా రక్తం మరుగుతున్నది..

నా రక్తం మరుగుతున్నది..

దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట వాసి, కల్నల్ బీ సంతోష్ బాబు ఇతర వీర జవాన్లకు నా సెల్యూట్. చైనా దుష్టబుద్దిపై కోపంతో రక్తం మరిగిపోతున్నది. వారిని చెప్పుతో కొట్టాలనిపిస్తున్నది. టిక్‌టాక్‌తోపాటు చైనా వస్తువులను నిషేధించండి అంటూ సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ ఆవేశంతో ట్వీట్ చేశారు.

మీ తల్లి బాధ నా తల్లి బాధగా

మీ తల్లి బాధ నా తల్లి బాధగా

కల్నల్ సంతోష్ బాబు, హవిల్దార్ పళనీ, సిపాయ్ ఓజా మరణాలపై దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్‌లో స్పందించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారి మాతృమూర్తులు పడే బాధను నా తల్లి కూడా ఫీల్ అవుతున్నారు. మీ వీర మరణాలను ఎప్పటికీ గుర్తిండి పోతాయి. వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తూ ఓ పాటను అంకితం చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

నా హృదయం బరువెక్కింది

నా హృదయం బరువెక్కింది

దేశ సరిహద్దులో శత్రు సేనలతో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికులకు నా ప్రగాఢ సంతాపం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగంతో నా హృదయం భారంగా మారింది. వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని అనిల్ రావిపూడి సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సైనికుల కథా నేపథ్యంతో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

2020 ఇంకా ఎన్ని చేదు ఘటనలు

2020 ఇంకా ఎన్ని చేదు ఘటనలు

గల్వాన్ వ్యాలీలో వీర మరణం పొందిన సైనికులే నిజమైన హీరోలు. వారి కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. అనేక పీడకలలను, చేదు అనుభవాలను పంచుతున్న 2020 త్వరగా ముగిసిపోవాలి. ఇక చేసింది చాలూ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

 వీర జవాన్లకు నా సెల్యూట్

వీర జవాన్లకు నా సెల్యూట్


గాల్వాన్ వ్యాలీలో వీర మరణం పొందిన సైనికులకు నా సెల్యూట్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సినీ హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

తెలంగాణ బిడ్డకు నా సెల్యూట్

తెలంగాణ బిడ్డకు నా సెల్యూట్

దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు‌కు నా శ్రద్దాంజలి. వీరమరణం పొందిన కల్నల్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ గడ్డ మీద పెట్టిన ఈ బిడ్డ దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అంకితం చేశారు. గల్వాన్‌లో వీర మరణం పొందిన వారికి నా సెల్యూట్ అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

తమన్నా ఎమోషనల్‌గా

తమన్నా ఎమోషనల్‌గా

మన భద్రత కోసం ప్రాణాలర్పించిన గల్వాన్ వ్యాలీ వీరులకు నా సెల్యూట్. వారి మరణంతో నా గుండె ముక్కలైంది. వారి ఆత్మలకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను అంటూ తమన్నా భాటియా ట్వీట్ చేసి సంతాపం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X