అతనిలా సంపాదించాలి .. టాలీవుడ్ స్టార్ హీరోపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో జగపతి బాబు కూడా ఒకరు. నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా విలక్షణమైనదే. మంచితనం, మొండితనం మిక్స్ అయిన పర్సనాలిటీ జగపతి బాబుది. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టడం ఆయన స్టైల్. సమాజాన్ని, మనుషుల్ని బాగా స్టడీ చేసిన జగపతిబాబు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆగర్భ శ్రీమంతుడైనా ఒక దశలో అన్ని పోగొట్టుకుని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ మళ్లీ కష్టపడి అన్ని సాధించారు.

కెరీర్‌లో స్టార్‌డమ్‌ను చూసిన జగపతి డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొన్నారు. అంతా అయిపోయింది అనుకున్న దశలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో జగపతి బాబు కూడా ఒకరు. తొలి నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండటంతో కులం, మతం , పేద, ధనిక అన్న అంశాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆ మాటకొస్తే సొంత సామాజిక వర్గాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. కులపిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు.

Tollywood senior actor jagapathi babu made sensational comments on Akkineni Nagarjuna life style

జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్రనటులతో సినిమాలు తీశారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ కావడంతో జగపతి బాబు లాంచింగ్ ఈజీగా జరిగిపోయింది. కానీ మొదట్లో సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నటన, డ్యాన్స్‌లపై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటిని తట్టుకుని నిలబడి శోభన్ బాబు తర్వాత కుటుంబ ప్రేక్షకుల ఫేపవరేట్ హీరోగా నిలిచారు. తర్వాతి కాలంలో అవకాశాలు లేక ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు జగపతిబాబు. తిరిగి లెజెండ్ సినిమా ద్వారా విలన్‌గా అవతారమెత్తి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. కూతురు విదేశీయుడిని ప్రేమించిందని తెలిసినా ఆ ప్రేమను అంగీకరించి పెద్ద మనసుతో పెళ్లి జరిపించారు జగపతి బాబు. .

తొలి నుంచి అందానికి , ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు జగపతి బాబు. తన ఫాంహౌస్‌లో ప్రకృతి మధ్య గడుపుతూ చద్దన్నం, అవకాయ పచ్చడి తింటూ సాధారణ జీవితం గడిపేస్తారు . 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌, ఫిట్‌నెస్‌తో కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు జగపతి బాబు . జగ్గూ భాయ్ అంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆయన తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.

Tollywood senior actor jagapathi babu made sensational comments on Akkineni Nagarjuna life style

ఇలాంటి విభిన్న భావాలున్న జగపతి బాబుకు చిత్ర పరిశ్రమలో కింగ్ అక్కినేని నాగార్జున అంటే ఎంతో ఇష్టం. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాగ్ తన కంటే రెండు మూడేళ్లు పెద్దాడని, తనను రెండ్రోజులకోసారి తలచుకుంటూ ఉంటానని జగపతి బాబు తెలిపారు. నాగార్జున చాలా తెలివైన వాడని.. తనకు డబ్బు సంపాదించడమూ తెలుసు, ఖర్చు పెట్టడమూ తెలుసు, ఇవ్వడమూ తెలుసునని ప్రశంసించారు. డబ్బుకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇస్తూ బ్యాలెన్స్ చేస్తాడని, ఈ విషయంలో ఆయన మా అందరికంటే చాలా ముందున్నారని జగపతి బాబు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: tollywood jagapathi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X