బడా నేతల కొడుకులు రేప్ చేస్తే.. శిక్ష పడుతున్నదా? మోహన్ బాబు ఫైర్

2024లో తెలుగు చిత్ర పరిశ్రమ అనూహ్యమైన ఘన విజయాలు సాధించింది. ఏకంగా రెండు సినిమాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ఇండస్ట్రీ హిట్‌లకు లెక్కే లేదు. ఇండస్ట్రీపరంగా విజయాలు ఉన్నప్పటికీ పలు వివాదాలు చిత్ర సీమలో కలకలం రేపాయి. నటి హేమ రేవ్ పార్టీ కేసు, రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం, జానీ మాస్టర్ కేసుతో పాటు ఏడాది చివరిలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే కలకలం రేపింది. దీని కంటేముందు టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న గొడవలు బజారుకెక్కడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.

తన తండ్రి తనపై దాడి చేశాడని మనోజ్.. తన కుమారుడు తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇంతలో మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ఫారిన్ నుంచి ఇండియాకు తిరిగి రావడంతో వివాదం మరికాస్త ముదిరింది. తన అన్నయ్య నా ఇంటికొచ్చి జనరేటర్‌లో పంచదార వేసి కరెంట్ సరఫరా నిలిచిపోయేలా చేశాడంటూ మనోజ్ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. ఈ గొడవల నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ములతో పోలీస్ ఉన్నాధికారులు వేర్వేరుగా భేటీ అయ్యారు. కుటుంబ వివాదాన్ని వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Tollywood senior actor mohan babu made sensational comments on Justice

మరోవైపు.. మోహన్ బాబు ఇంటి వద్ద చోటు చేసుకున్న గొడవను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం పెను వివాదానికి దారి తీసింది. ఈ దాడిలో సదరు మీడియా ప్రతినిధి తలకు తీవ్రగాయం కావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధులు అక్కడికక్కడే ధర్నాకు దిగారు. మరోవైపు.. మోహన్ బాబుపై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దుమారం రేపింది.

అల్లు అర్జున్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో మోహన్ బాబు కూడా అరెస్ట్ అవుతారంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో మోహన్ బాబు జాడ లేకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో మోహన్ బాబు స్వయంగా ట్వీట్ చేసి.. తాను ఎక్కడికి పోలేదని, ఇంట్లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో ఆయన అరెస్ట్ తప్పదా అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.

మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక లారీ క్లీనర్ ఒకమ్మాయిని రేప్ చేస్తే వాడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేస్తారు. అదే బడా బాబులకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్లు అయినా న్యాయం జరగదని మోహన్ బాబు తేల్చిచెప్పారు. డబ్బున్నోడికి , పదవిలో ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుందని .. ఈ విషయాన్ని తన సన్ ఆఫ్ ఇండియాలో చెప్పే ప్రయత్నం చేశామని కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు. తప్పు జరుగుతుంటే అంతా ఏకం కావాలని.. అప్పుడే ఏమైనా సాధించగలమని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X