SP Bala Subrahmanyam చావుకు ఓ రకంగా నేనే కారణం.. సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్లు!
ది లెజండరీ సింగర్.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన పాటలతో అందరినీ ఉర్రూతలూగించిన ఈయన దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు సుపరిచితం. అయితే ఎన్నో భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి.. సంగీత సామ్రాజ్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఏలిన ఈయన 2020 సెప్టెంబర్ 25వ తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు కరోనా కారణంగానే ప్రాణాలు కోల్పోయారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ నటుడు.. ఎస్పీబీ చావుకు తాను కూడా ఓ కారణం అంటూ చెప్పి షాక్ ఇచ్చారు. అసలు ఆయన ఎవరు, బాల సుబ్రహ్మణ్యం చావుకు ఆయన ఎలా కారణం అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

74 ఏళ్ల వయసులో కరోనా కారణంగా ఈ లోకాన్ని వీడిన ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం చావుకు తానే కారణం అంటూ టాలీవుడ్ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ వెల్లడించారు. వరుసకు బాలుకు బావ అయిన ఈయన వల్లే బాలు చనిపోయారనే భావన తనలో ఉందని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆయన అలా ఎందుకు ఫీల్ అవుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శుభలేఖ సుధాకర్.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా సమయంలో శుభలేఖ సుదాకర్.. ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారట. కరోనా ఉన్నప్పటికీ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ చేశారట. దీంతో తాను ధైర్యంగా ఆ షూటింగ్ లో పాల్గొన్నారట. అయితే అదే సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫోన్ చేసి మాట్లాడారట.
కరోనా సమయంలో మీరు షూటింగ్ లో పాల్గొనడం అవసరమా అంటూ ప్రశ్నించగా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు... ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఒకే ఒక్క షూటింగ్ ఇదని సుధాకర్ వివరించారట. అలాగే శానిటైజ్ చేయడం, మాస్కులు వాడడం వంటి అనేక రాకల జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడంతో.. ఓ రోజు బాలు కూడా అక్కడకు వెళ్లారట. చాలా సేపు సుధాకర్ తో మాట్లాడారట. ఆ తర్వాత కొందరు వచ్చి బాలుతో ఫొటోలు దిగుతామని అన్నారట. ఒకే ఫొటో కదా ఇవ్వమని సుధాకర్ అనగా.. దూరంగా ఉండే ఫొటోలు దిగారట.

అయితే ఒకే ఒక్క ఫొటో అని అడిగిన వాళ్లు 96 ఫొటోలు దిగే వరకు బాల సుబ్రహ్మణ్యంను విడిచి పెట్టలేరట. అయితే ఆ తర్వాత మూడు రోజులకే బాలుకు కరోనా సోకిందని సుధాకర్ కు ఫోన్ వచ్చిందట. అప్పటికే ఆయనను ఆస్పత్రిలో చేర్పించడం.. వ్యాధి తీవ్రత ఎక్కువ అయి ప్రాణాలు కోల్పోయవడం జరగిందని.. దీనితంటికి కారణం తానే అని సుధాకర్ వివరించారు. అలా తాను చెప్పడం వల్లే ఆయనకు అక్కడకు రావడం, కరోనా సోకిందని అనిపిస్తుంటుందని వివరిస్తూ.. ఫుల్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











