Subhalekha Sudhakar: నా నటన నా కొడుకునే మెప్పించలేదు.. అందుకేనేమో ఎక్కువ అవకాశాలు రావట్లేదు!

శుభలేఖ సుధాకర్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన ఇప్పటికీ పలు సినిమాల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అద్భుతమైన పాత్రలు వస్తే తప్ప ఒప్పుకోకుండా.. తన అభినయాన్ని కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు.

తన నటనతో తన కొడుకునే మెప్పించలేకపోతున్నాట్లు వెల్లడించారు. ఎప్పుడో ఒక అవకాశం తప్పితే తన వద్దకు ఎక్కువగా ఛాన్సులు రావట్లేదని పేర్కొన్నారు. అలాగే తనకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రాకపోవడానికి గల కారణాలు కూడా వివరించారు. ఆవివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Senior Actor Subhalekha Sudhakar Said Reasons for Not Getting Film Opportunities

వాస్తవానికి సుధాకర్ ఇంటిపేరు శుభలేఖ కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన శభలేఖ సినిమాతో సినీ రంగానికి పరిచయం అవ్వడం.. విపరీతమైన గుర్తింపు రావడంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో సుధాకర్ - తులసిల జోడీకి బాగా క్రేజ్ రావడంతో ఆ తర్వాత వచ్చిన.. మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాల్లో జంటగా నటించారు.

ఇలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు సుధాకర్. అయితే కెరియర్ చక్కగా నడుస్తున్నప్పుడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఆ దంపతులకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఆయన పేరే శ్రీకర్. అయితే అనేక మందిని తన నటనతో ఏడిపించి, నవ్వించి, సందడి చేసిన సుధాకర్.. తన కొడుకును మాత్రం నటనతో మెప్పించలేకపోయాడట.

ఇప్పటి వరకు తాను చేసిన ఏ చిత్రం కూడా.. తన కొడుకుకు అంతగా నచ్చలేదట, మెప్పించలేకపోయాడట. తన కొడుకునే మెప్పించలేని తాను.. ప్రేక్షకులను మెప్పిస్తున్నానే భావన తనకు రావట్లేదని.. అందుకేనేమో నాకు అవకాశాలు ఎక్కువగా రావట్లేదంటూ చెప్పుకొచ్చాడు. మసూద సినిమాలో ముస్లిం వృద్ధుడిగా శుభలేఖ సుధాకర్ ఇరగదీశారు. ఇప్పుడు యాత్ర 2 సినిమాలోనూ ఓ అద్భుతమైన పాత్రలో కనిపించి మెప్పించారు. ఇకముందు అయినా ఈయన ఎక్కువ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటారేమో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X