అలీతో ప్రేమాయణం.. అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకోవాలనుందటున్న స్టార్ నటి.. ఎవరంటే?
దేశముదురు సినిమాలో ఆవకాయ గురించి చెప్పి అందరి నోళ్లలో నీళ్లూరేలా చేసిన నటి కోవై సరళ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించ గల సత్తా కల్గిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ముఖ్యంగా 62 ఏళ్ల వయసుకు వచ్చిన ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తున్నా.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే గతంలోనే ఈమె ఒకరిని ప్రేమించినట్లు తెలిపింది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలని ఉంది చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
1962లో ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన కోవై సరళకు నలుగురు సోదరులు. ప్రస్తుతం వీరంతా కోయంబత్తూరులోనే సెటిల్ అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె అక్కడకు, ఇక్కడకు తిరుగుతుంటారు. పదో తరగతి చదువుతుండగానే.. ఈ క్యూట్ బ్యూటీ గర్భిణిగాను ఓ సినిమాలో నటించి మెప్పించింది. అతి చిన్న వయసులోనే తన అందం, అభినయంతో అందరికీ దగ్గరైన ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు కల్గిన ఈమె సినిమాల్లో చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చింది.

ముఖ్యంగా ఇక్కడికి వస్తూ రావడమే.. అలనీ చూసి తెగ సంబురపడిపోయింది. నీ అక్కకు పట్టుచీర తెచ్చావు, నీ అమ్మకు తెచ్చావు.. నాకు మాత్రం ఇంకా చీర కొనివ్వలేదంటూ కామెంట్లు చేసింది. అప్పటి వరకు చున్నీతో మొహం దాచుకున్న ఈమె ఆ డైలాగ్ చెప్పగానే తెరిచి.. అలీకి సర్ ప్రైజ్ ఇచ్చింది. అలాగే ఆవకాయ డైలాగ్ కూడా చెప్పింది. ఆ తర్వాత వెల్ కామ్ చెప్పి మాట్లాడిన అలీ ఇప్పటి వరకు నీవు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు. తనకు ఇష్టం లేదని.. అయినా పెళ్లి చేసుకుంటేనే జీవించాలి ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించింది.

అలా ఏం లేదు కానీ.. ఇంతకాలంలో నీవు ఎవరినీ ప్రేమించలేదా అని అలీ అడిగాడు. దీనికి గతంలోనే ఓసారి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పానని తెలిపింది. ఎవరని అడగ్గానే.. నీకే చెప్పానుగా.. ఇప్పటికీ నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదంటూ సరదాగా మాట్లాడింది. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అనగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ తర్వాత తనకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అద్భుతమైన దేశముదురు సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి తనకు విపరీతమైన గుర్తింపు వచ్చేలా చేశాడని.. ఆయన థాంక్స్ అంటూ వెల్లడించింది. ప్రస్తుతం అలీతో సరదాగా.. ప్రోమో విడుదల కాగా అందులో ఈ కామెంట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











