బెదిరించి..విషం పెట్టి చంపాలని చూశారు.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో చాలా బిజీగా కనిపించిన వారిలో బాబు మోహన్ ఒకరు. ఆయన చేసినటువంటి పాత్రలు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అనే చెప్పాలి. విభిన్నమైన కామెడీ బాడీ లాంగ్వేజ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆయన కొన్నాళ్లకు రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సమయాల్లో ఆయన కొన్ని అపాయాలను కూడా ఎదుర్కొన్నారట. విషం పెట్టి చంపాలని కూడా చూసినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

బెస్ట్ కాంబినేషన్

బెస్ట్ కాంబినేషన్

బాబు మోహన్ అనగానే అందరికీ కూడా కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో చేసిన కామెడీ సీన్స్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. అప్పట్లో వీరి కలయికకు ఎలాంటి గుర్తింపు ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి వెండి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు పగలబడి నవ్వుకునే వారు. అప్పట్లో వారు ఉంటే సినిమా సక్సెస్ అయ్యేది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉండేది.

 అన్ని రకాల పాత్రల్లో..

అన్ని రకాల పాత్రల్లో..

ఇక బాబు మోహన్ నటుడిగా అయితే తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా అందుకున్నారు. వందలాది సినిమాల్లో నటించిన ఆయన కొన్ని సినిమాల్లో కీలకపాత్రలో కూడా కనిపించారు. పాజిటివ్ నెగిటివ్ రోల్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపించారు. అలాగే టెలివిజన్ రంగంలో కూడా ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు.

రాజకీయాల్లో ఇలా..

రాజకీయాల్లో ఇలా..

ఇక బాబు మోహన్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం కూడా వచ్చింది. మొదట తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా అలాగే మరొకసారి మంత్రిగా కూడా కొనసాగారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కూడా కొనసాగుతూ అనంతరం విభేదాలతో ఆ పార్టీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరారు.

అదొక వ్యసనంలా మారింది

అదొక వ్యసనంలా మారింది

అయితే ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి కూడా తెలియజేశాడు. 'సినిమాలు చేసే సమయంలో నాకు భరణి పాన్ తినే అలవాటు ఉండేది. ఆ తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోయింది. రోజుకు కొన్నిసార్లు 30 కి పైగా పాన్లు తినే వాడిని. షూటింగ్ వెళ్లేటప్పుడు అలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా డబ్బా నిండా పాన్ లు కూడా తీసుకువెళ్ళేవాన్ని.. అని అన్నారు.

విషం కలిపారు

విషం కలిపారు

నేను హైదరాబాద్ రావాలి అంటే సంగారెడ్డి మీదుగా వచ్చేవాన్ని. ఇక దారి మధ్యలో నాకు తెలిసిన ఒక పాన్ షాప్ లోనే ప్రత్యేకంగా పాన్ కట్టించుకుని వెళ్లాను. అయితే కొద్ది దూరం వెళ్లేసరికి కారులో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ఆ డబ్బాలో ఉన్న పాన్ ఎంత మాత్రం తినవద్దు అని చెప్పారు. ఎందుకంటే అందులో విషం కలిపి ఉన్నట్లు పాన్ కట్టిన వ్యక్తి భార్య నాకు ఫోన్ చేసి చెప్పింది. కొందరు వ్యక్తులు బెదిరించిన కారణంగానే అలా చేసినట్లుగా ఆమె నాతో చెప్పుకొని ఏడ్చింది. ఆరోజుతోనే నాకు రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా.. అని అర్థం అయినట్లుగా బాబు మోహన్ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X