టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. మెగాస్టార్ సినిమా డైరెక్టర్ మృతి
కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త ఇంకా మరిచిపోక ముందే టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు కె వాసు మృతి చెందారు. అనారోగ్యంతో ఆయన కిమ్స్ హాస్పిటల్ లో తాజాగా మృతి చెందారు.
గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబందిత వ్యాధితో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరంగేట్రం చేసిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు దర్శకుడిగా కె వాసు కావడం విశేషం. చిరంజీవికి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన అతన్ని మెగాస్టార్ ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు.

ఇక అయన మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కె వాసు తండ్రి ప్రత్యగాత్మ కూడా దర్శకుడే. తండ్రి వద్దనే అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కె వాసు 22 ఏళ్ళకె దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా కె వాసు మొదటి సినిమా కూడా ప్రాణం ఖరీదు కావడం విశేషం.
కె వాసు దర్శకత్వంలో వచ్చిన శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సాయిబాబా గురించి తెలుగు ప్రజలకి భాగా తెలిసింది ఆ చిత్రంతోనే అని చెప్పాలి. అతని చిత్రం చూసిన తర్వాత ఎక్కువ మంది తెలుగు నాట షిర్డీ సాయి భక్తులుగా మారారంతే అతిశయోక్తి కాదు. ఇక కె వాసు దర్శకుడు 2004లో ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి మూవీని శ్రీకాంత్ తో తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం కిమ్స్ హాస్పిటల్ నుంచి ఫిల్మ్ నగర్ లో ఆయన ఇంటికి తీసుకొని వస్తారు. అక్కడి నుంచి 12 గంటలకి మహా ప్రస్థానంకి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక కె వాసు అంత్యక్రియలలో సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











