చిరంజీవితో అగ్ర హీరో విభేదాలు.. 47 ఏళ్ల క్రితం జరిగింది అదేనట!

టాలీవుడ్ సీనియర్ నటుడు, బిజినెస్ మెన్ మురళీ మోహన్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వ్యాపారాలతో బిజీ కారణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు చేయలేకపోతున్నారు. ఏదేమైనా ఆయన బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ ఇంటర్వ్యూలతో తెలుగు ఆడియెన్స్ ను మాత్రం ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీసెంట్ గా పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. 70, 80లో సినిమాలు, నటీనటుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.

చిరంజీవిపై ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్ని రికార్డులున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మెగాస్టార్ రికార్డులను తెలియజేసేలా మురళీ మోహన్ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.... 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' చిత్రం విడుదలైంది. హీరోగా చిరుకు అది మొదటి సినిమా కావడం విశేషం. అంతకు ముందే 'పునాది రాళ్లు' అనే చిత్రంలో హీరోగా నటించారు. కానీ థియేటర్లలోకి 'ప్రాణం ఖరీదు' చిత్రం మొట్టమొదటిగా రిలీజ్ అయ్యింది. హీరోగా తనకు ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

Tollywood Senior Hero Underestimated Megastar Chiranjeevi 47 Years ago Incident

అయితే.. 'ప్రాణం ఖరీదు' సినిమాకు ముందు, చిరంజీవి హీరోగా ఇంకా ఒక్క సినిమా కూడా ప్రారంభం కాక ముందు జరిగిన ఓ ఘటనను మురళీ మోహన్ తాజాగా అభిమానులతో పంచుకున్నారు. 47 ఏళ్ల కింద వచ్చిన 'ప్రాణం ఖరీదు'తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను అలరించారని తెలిపారు. కానీ ఆ సినిమాకు ముందు మెగాస్టార్ సపోర్టింగ్ రోల్స్ లో నటించేవాడని చెప్పారు. అదే సమయంలో చిరులోని ఇండస్ట్రీలోని ప్రముఖులు గుర్తిస్తూ ఉన్నారన్నారు.

మురళీ మోహన్, కృష్ణం రాజు, చిరంజీవి అప్పట్లో కలుస్తూనే ఉండేవారని చెప్పారు. ఆ సమయంలో ఖాళీ దొరికితే చిరంజీవి తన డ్యాన్స్ తో, యాక్టింగ్ తో ఆకట్టుకునే వాడని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి టాలెంట్ చూసి మురళీ మోహన్ ఎంతగానో ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. హీరోగా మంచి అవకాశాలు అందుకుంటాడని గ్రహించారంట. కానీ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు మాత్రం చిరంజీవి విలన్ పాత్రకే పరిమితమవుతాడని అన్నరాంట. వెంటనే విలన్ ఏంటయ్యా.. ఇండస్ట్రీకి అమ్మ మొగుడు గ్యారంటీ అని సవాల్ చేశారంట.

Tollywood Senior Hero Underestimated Megastar Chiranjeevi 47 Years ago Incident

ఆ కొద్ది కాలానికే చిరంజీవి తన డ్యాన్స్, యాక్షన్, నటనతో ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిపోయారంట. అలాగే చిరంజీవి వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయని చెప్పారు. డ్యాన్స్ విషయంలో గానీ, ఫైట్ సీన్ల విషయంలో గానీ రియాలిటీ పార్ట్ పెరిగిందని చెప్పారు. అందుకే టాలీవుడ్ ను చిరంజీవి రాకముందు.. చిరంజీవి వచ్చిన తర్వాతగా అభివర్ణించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆరుపదుల వయస్సు దాటినా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. చివరిగా 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'విశ్వంభర'లో నటిస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడితోనూ ఓ క్రేజీప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X