Jayasudha: ఏఎన్నార్, ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న తేడా అదే.. తెగ ఇబ్బంది పడిపోయేవారు!

టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజ నటిగా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే సినిమాలు చేసింది. అనేక హిట్లు కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ సీరియర్ హీరోలు అయిన సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావుల గురించి మాట్లాడింది. వారిద్దరి మధ్య ఉన్న తేడాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమాతో జయసుధ తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించింది. ఇందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా కూడా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరోయిన్ ఈమే. అంతేకాకుండా ఒకే ఏడాదిలో ఈమె నటించి పాతిక సినిమాలు విడుదల అయ్యాయి అంటే ఈమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

Tollywood Senior Heroine Jayasudha Said The Differences between And And NTR

ముఖ్యంగా జయసుధ టాప్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే తనతో సినిమాలు చేసిన టాప్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్ లతో తన బంధం ఎలా ఉండేదో కూడా వివరించింది. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఉన్న తేడాల గురించి చెప్పుకొచ్చింది. నందమూరి తారక రామారావుతో పోలిస్తే అక్కినేని నాగేశ్వర రావు కాస్త చిలిపి అని చెప్పుకొచ్చింది. ఆయనతో కాస్త మాట్లాడేవాళ్లం అని వివరించింది. ఈ ఇద్దరు హీరోల పైన ఉన్న గౌరవంతో ఎక్కువ చనువు తీసుకోకపోయినా.. ఏఎన్నార్ తో కాస్త మాట కలిపేదాన్నని స్పష్టం చేసింది.

అయితే సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కువగా మాట్లాడే వారు కాదని జయసుధ స్పష్టం చేసింది. తనతో పాటు పని చేసిన సీనియర్ హీరోయిన్లు.. వాణిశ్రీ, శారద వంటి వాళ్లతో బాగానే మాట్లాడేవారని తెలిపింది. అలాగే ఇతర నటులు చలపతి రావు, అల్లు రామలింగయ్య, చలపతి రావు, రావు గోపాల్ రావు వంటి వాళ్లందరితో కలిసి కూర్చొని చాలా బాగా చర్చించేవారని వివరించింది. కానీ తమతో అంటే తమ తరం హీరోయిన్లతో మాట్లాడేందుకు మాత్రం కాస్త ఇబ్బంది పడేవారని వెల్లడించింది. హైస్కూల్ లో చదువుకుని.. నేరుగా వచ్చిన తమతో సినిమాలు చేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడేవారని వివరించింది.

జయప్రధ, జయసుధతో సినిమాలు చేయాలనేగానే ఆయన చాలా ఆలోచించారని.. కానీ చేయాల్సి వచ్చిందని జయసుధ చెప్పుకొచ్చింది. అయితే ఏఎన్నార్ మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా తమతో చిత్రాలు చేసేవారని.. అలాగే మాట్లాడే వారని వివరించింది. తాను అందరి హీరోలతో ఎక్కువ జోక్స్ చేస్తూ హుషారుగా తిరిగేదాన్నని.. కానీ ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ లతో గీత దాటి చనువుగా మాత్రం ఎప్పటికీ ప్రవర్తించలేదని అసలు విషయం చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X