సమంతకు రిప్లై ఇస్తే ఆమె మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు.. పిచ్చి కూతలు ఆపితే మంచిది: నిర్మాత
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీస్కొని.. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్ లు, ప్రమోషన్ పనులతో బిజీగా మారిపోయింది.
ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ... తెగ సందడి చేస్తోంది. అయితే ఇటీవల నిర్మాత చిట్టిబాబు చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే సమంత కూడా అతని కామెంట్స్ కు పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చింది. ఇక మరోసారి సమంత కామెంట్స్ పై స్పందించిన చిట్టిబాబు వార్తల్లో నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఏ మాత్రం కరెక్ట్ కాదు అని..: మొదట సమంత గురించి నిర్మాత చిట్టిబాబు.. ఊహించని విధంగా రియాక్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పలు గ్లామరస్ పాత్రలు చేసిన సమంత ఇప్పుడు మాత్రం అనుకున్నంత స్థాయిలో క్రేజ్ అందుకోవడం లేదు అని ముఖ్యంగా శాకుంతలం లాంటి ప్రాజెక్టు అసలు ఆమెకు ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఆయన వివరణ ఇచ్చారు. ఇంతటితో సమంత ఒక మంచి ఆర్టిస్ట్ గానే కొనసాగితే బెటర్ అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆరోగ్యం బాగాలేదంటూ కన్నీళ్లు: అంతే కాకుండా సామ్ కెరియర్ ముగిసిపోయిందని, ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు చీప్ ట్రిక్స్ ఉపయోగించిందని చిట్టిబాబు వివరించారు. అప్పట్లో యశోద టైమ్ లో వర్కౌట్ అయినట్లు అన్నిసార్లు అది కరెక్ట్ కాదని అన్నారు. కావాలనే సినిమా ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాల్లో ఆరోగ్యం బాగాలేదంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా దారుణం అంటూ చెప్పుకొచ్చారు.

అందరికీ అర్థమయ్యేలా కామెంట్లు: అయితే ఈ విషయంపై స్పందించిన సమంత.. నేరుగా ఆయన పేరు చెప్పకుండా చెవిలో వెంట్రుకల గురించి ఓ స్టోరీ పెట్టింది. అన్నది ఆయననే అని అందరికీ అర్థమయ్యేలా కామెంట్లు చేసింది. వ్యక్తుల చెవుల నుండి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ లో సెర్చ్ చేసి దాని స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ.. అయితే టెస్టో స్టిరాన్ పెరగడమే మనుషులు చెవుల్లోంచి జుట్టు పెరగడానికి కారణం అంటూ చెప్పుకొచ్చింది.
అదంతా మూర్ఖత్వం అంటూ: అయితే తాజాగా దీనిపై నిర్మాత చిట్టిబాబు స్పందించారు. తన మీద దాడి చేస్తే తాను తీవ్రంగా ప్రతి దాడి చేస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే తన పేరు మెన్షన్ చేయలేదు కాబట్టే తాను కోర్టుకు వెళ్లట్లేదని.. లేకపోతే కచ్చితంగా వెళ్లే వాడినని వివరించారు. ఇఫ్ యు నో.. యు నో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి తెలివితేటలు ప్రదర్శించానుకుంటుందేమో కానీ అదంతా మూర్ఖత్వం అంటూ చిట్టిబాబు చెప్పుకొచ్చారు.

మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియకుండా..: తన పేరు పెట్టలేదు కాబట్టే తాను కూడా సమంత పేరు చెప్పడం లేదని.. లేకపోతే తానిచ్చే రిప్లైకి సమంత మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియకుండా పోయేదంటూ వ్యాఖ్యానించారు. తన వెంట్రుకల గురించి బదులుగా తాను అన్న మాటల గురించి, నిజాయితీ గురించి మాట్లాడితే చాలా బాగుండేదన్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కూతలంటూ నవ్వారు. మరి సమంత ఆ కామెంట్స్ కు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











