జోస్యం చెబుతున్న స్టార్ హీరో.. అల్లు అర్జున్ విషయంలో నిజమైంది.. మరి పల్లవి ప్రశాంత్ విషయంలోనూ అదే జరగబోతుందా?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, బిగ్ బాస్ తెలుగు 7 షో కంటెస్టెంట్ శివాజి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఒకప్పుడు తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన ఈయన.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవలే బిగ్ బాస్ షోకు కంటెస్టెంట్ గా వచ్చి అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లకు ఫేవెరట్ అన్నగా మారిపోయిన ఇతడు.. బయటకు వచ్చాకా కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారు.
అయితే తాజాగా శివాజి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా నాలుగు, ఐదు సంవత్సరాల క్రితం శివాజి ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా అప్పుడు అల్లు అర్జున్ కు అంత పెద్ద క్రేజ్ లేదు. కానీ స్టైలిష్ స్టార్ లోని టాలెంట్ ను గుర్తించిన శివాజి.. అతి తక్కువ కాలంలోనే బన్నీ స్టార్ హీరో అవుతాడని చెప్పాడట. ఓ పెద్ద హీరోతో పోలుస్తూ.. అద్భుతమైన అవార్డులు అందుకుంటాడని చెప్పాడట. అయితే పుష్ప సినిమాకు గాను బన్నీ చాలానే అవార్డులు అందుకున్నాడు.

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి.. దేశం మొత్తం తన చిత్రాల గురించి ఎదురు చూసేలా చేశాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల వాళ్లు కూడా పుష్ప2 చిత్రం కోసం వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో శివాజి చెప్పింది నిజం కాగా.. ఆయన తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలిపి అందరికీ షాకిచ్చారు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సినిమాల్లో కచ్చితంగా రాణిస్తారని అన్నారు.

అతడికి కరక్ట్ ఛాన్స్ ఇచ్చి నటనలో మెలుకువలు నేర్పిస్తే.. కచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటాడని శివాజి తెలిపాడు. అలాగే అతడు ధనుష్ అంతటి స్థాయికి చేరుకుంటాడని.. తనకు ఆ నమ్మకం ఉందని తెలిపాడు. తన వద్దే కనుక డబ్బులు ఉండి, సినిమా తీసే అవకాశం ఉంటే.. కచ్చితంగా రైతుబిడ్డను హీరోగా పెట్టి సినిమా తీస్తానని అన్నాడు. అది కుదరకపోతే తనకు తెలిసిన వాళ్లకు చెప్పి అయినా సరే అతడికి అవకాశం ఇప్పిస్తానని అన్నాడు. అల్లు అర్జున్ విషయం నిజమైన శివాజి జోస్యం.. మరి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విషయంలోనూ నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











