చిరంజీవి తొలి చిత్ర రచయిత ఇక‌లేరు.. తెలుగు సినీ ప్రముఖుడు కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమకు ఆరు దశాబ్దాలకుపైగా సేవలందించిన ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత సీఎస్ రావు ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే..

 సీఎస్ రావు వ్యక్తిగత జీవితం

సీఎస్ రావు వ్యక్తిగత జీవితం

సీఎస్ రావు వయసు 85 సంవత్సరాలు. సినీ జీవితానికి దూరంగా ఉంటున్న ఆయన చిక్కడపల్లిలోని గీతాంజలి స్కూల్‌లో కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సింగపూర్‌లో ఉన్నారు.

సీఎస్ రావు సినీ జీవితం

సీఎస్ రావు సినీ జీవితం

ఇక సీఎస్ రావు సినీ జీవితం గురించి చెప్పుకొంటే.. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు లాంటి చిత్రాలకు కథలు, మాటలు అందించారు. ఊరుమ్మడి బతుకులు సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది.

నటుడిగా.. నాటక రంగానికి సేవలు

నటుడిగా.. నాటక రంగానికి సేవలు

సీఎస్ రావు నటుడిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు చిత్రంలోనూ, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సొమ్మెకడిది సోకకడిది చిత్రాల్లో నటించారు. నాటక రంగానిక విశేష సేవలు అందించారు. తన సినీ, నాటక జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలచుకొన్నారు. పలువురు నటీనటులకు యాక్టింగ్‌లో శిక్షణ ఇచ్చి మంచి గురువుగా పేరు తెచ్చుకొన్నారు.

Recommended Video

Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
అంత్యక్రియలకు రావొద్దు

అంత్యక్రియలకు రావొద్దు

కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున సీఎస్ రావు అంత్యక్రియలకు ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు వేడుకొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను గౌరవించాలని, వ్యక్తిగతం ఎవరూ రావొద్దని వారు పేర్కొన్నారు. బుధవారం సీఎస్ రావు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమారుడు సింగపూర్‌లో ఉండటం వలన ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X