"వాణీ విశ్వనాథ్ నేను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ అలా ఆగిపోయింది"
టాలీవుడ్ టాప్ సీనియర్ రచయిత, నటుడు అయిన తోటపల్లి మధు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా తాను ఓ సీనియర్ హీరోయిన్ తో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చాడు.
ఆ హీరోయిన్ ను తీసుకెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా వారిద్దరూ.. ఓరోజు పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకోగా.. ఓ సమస్య వచ్చిందని దాని వల్ల తమ పెళ్లి ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణీ విశ్వనాథ్. అయితే పెళ్లి పీటల వరకూ వచ్చిన వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మాయా బజార్ సినిమాతో నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. గోల్ మాల్, లక్ష్మీ నరసింహ, అల్లరి పిడుగు, మహారథి, సినిమా చూపిస్త మావ, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, శ్రీశ్రీ, సుప్రీమ్, పటేల్ సర్, జూన్ 1:43, గౌతమ్ నంద, గల్ఫ్, యాత్ర, నేను నా నాగార్జున, నా లవ్ స్టోరీ, సోడ గోలీసోడా, లెహరాయి, భారీ తారాగణం, నారాయణ అండ్ కో, ఏందిరా ఈ పంచాయితీ, పారిజాత పర్వం వంటి చిత్రాల్లోనూ నటించారు. ఇలా కెరియర్ లో దూసుకు పోతున్న ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ముఖ్యంగా తన ప్రేమ కథల గురించి, అఫైర్ ల గురించి చెప్పమని అనగా.. షాకింగ్ కామెంట్లు చేశారు. తాను వయసులో ఉండగా.. హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ను ప్రేమించినట్లు చెప్పారు. ఆమె కూడా తనను ప్రేమించింది... ఏడాది పాటు వీరు ప్రేమాయణం సాగించారని చెప్పుకొచ్చారు. అయితే ఓరోజు తాము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు వివరించారు. కారేసుకుని మరీ పెళ్లి చేసుకోవాలని ఇంట్లోంచి బయలు దేరారట.

కేరళలోని ఓ గుడికి వెళ్లారట. అక్కడే తమ పెళ్లి చేసుకోవాలనుకోగా.. ఆరోజు సూర్య గ్రహణం అంట. దీంతో తమ పెళ్లి ఆరోజు ఆగిపోయిందని... ఆ తర్వాత కూడా ఓ రెండు మూడు సార్లు అలాగే జరిగిందని చెప్పుకొచ్చారు. పలు కారణాల వల్ల తమ పెళ్లి వాయిదా పడుతూ వచ్చిందని వివరించారు. చివరకు తామిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తాము విడిపోయినట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











