దిల్ రాజు కంపౌండ్‌లో ఆర్జీవి స్నేహితుడు.. సక్సెస్ కాకపోయినా..
టాలీవుడ్ లో కొంతమంది టెక్నీషియన్స్ కి ఒక మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా రైటర్స్ కి మన నిర్మాతలు దర్శకులు చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు. వారి సినిమాలు ప్లాప్ అయినా కూడా కొన్నిసార్లు మంచి మంచి అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అలాంటి లిస్ట్ లో ఒక ఆర్జీవి స్నేహితుడు కూడా ఉన్నాడు. అతని పేరు బీవీఎస్.రవి.
టాలీవుడ్ లో చాలా మంది టాప్ డైరెక్టర్ హీరోలతో క్లోజ్ గా ఉండే రవి 2002 నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రైటర్ గా ఖడ్గం, పరుగు, కింగ్, తులసి వంటి సినిమాలకు పని చేశాడు. ఆ తరువాత పూరి సినిమాలకు కూడా రైటర్ గా పని చేశాడు. అనంతరం గోపిచంద్ వాంటెడ్ సినిమాను డైరెక్ట్ చేసిన రవి పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ జవాన్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దర్శకుడిగా సక్సెస్ కావడం లేదని మళ్ళీ రైటింగ్ ఫీల్డ్ లోకి వచ్చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో విక్రమ్ కుమార్, విరించి వర్మ డైరెక్ట్ చేయనున్న సినిమాలకు సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మాతగా కూడా కొన్ని చిన్న సినిమాలను నిర్మించేందుకు రవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











