సినిమా హిట్టయితే సీక్వెల్ పక్కా.. టాలీవుడ్ నయా ట్రెండ్.. ఏయే సినిమాలకు పార్ట్ 2లు వస్తున్నాయంటే?
ఈ మధ్య కాలంలో ఎక్వుగా సీక్వెల్ సినిమాలు వస్తున్నాయి. గతంలో వీటి హవా ఎక్కువగా ఉండకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఒక్క సినిమా హిట్టు అయిందంటే చాలు దానికి సీక్వెల్ కచ్చితంగా వస్తుంది. అలా తెలుగులో రాబోయే సినిమాలు అన్నీ చాలా పెద్దవి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టినవే. చిన్న హీరోల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకూ అంతా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఈ ఏడాది రాబోయే సరికొత్త సీక్వెల్ సినిమాలు ఏవి, మొత్తం ఎన్ని రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పుష్ప... అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈక్రమంలోనే దీనికి పార్ట్ 2 ను తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప 2 ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా ఇటీవలే వచ్చిన సలార్ సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. అదే సలార్ 2: శౌర్యంగ. ఈ సినిమాపై కూడా ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న దేవర సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. అయితే పార్ట్ 1 విడుదల అయిన తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ఇక ఇటీవలే తేజా సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాకు కూడా సీక్వెల్ ఉందని.. దాని పేరే జై హనుమాన్ అని డైరెక్టర్ ప్రకటించేశారు. అలాగే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు కూడా పార్ట్ 2 ఉంటుందని ఇప్పుడో బోయపాటి వెల్లడించారు. మరి ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.

రెండేళ్ల క్రితం వచ్చిన విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు కు కూడా పార్ట్ 2 తీసుకు వస్తున్నారు. టిల్లు స్క్వేర్ పేరుతో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నమోదు అ్యయాయి. అలాగే రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన గూఢచారి సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. గూడఛారి 2తో పార్ట్ 2 రాబోతుంది.

అలాగే అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఆ సినిమాలోనే తెలిపారు. అయితే నెక్స్ట్ పార్ట్ లో హీరోగా నాని తీసుకున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇంకా తెలియదు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార సినిమాకు కూడా పార్ట్ 2 ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ సినిమాకు కూడా పార్ట్ 2 ఉంది. అయితే ప్రాజెక్టు జెడ్ గా పిలుస్తున్న ఆ సినిమా రావాలంటే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఆగాల్సిందే.

అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి సినిమాకు కూడా పార్ట్ 2 రాబోతుంది. ఇటీవలే గీతాంజలి మళ్లీ వచ్చింది పేరుతో ఆ సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమాకు కూడా పార్ట్ 2 ఉన్నట్లు ఎప్పుడో చెప్పారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. చందు మెండేటి, నిఖిల్ సిద్దార్థ కాంబోలో వచ్చిన కార్తికేయ సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. కార్తికేయ 2 పేరుతో ఈ సినిమా రానుంది.
అలాగే కార్తీక్ వర్మ దండు, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన విరూపాక్ష సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. ఈ సినిమా కూడా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇలా 15 సినిమాలు సీక్వెల్ కు రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ లిస్టులో పొలిమేర సినిమాను ప్రస్తావించలేదు. సినిమా చివర్లో ఈ చిత్రానికి నెక్స్ట్ పార్ట్ ఉన్నట్లు చెప్పినా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలేస్తున్న ఈ నయా ట్రెండ్ చాలా బాగా పని చేస్తోంది. మరి పార్ట్ 2లు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











