For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ పరిశ్రమలో మరో విషాదం: కరోనాతో టాలీవుడ్ సింగర్ కన్నుమూత

  |

  కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీని ప్రభావంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రెండో దశలో ఇది మరింత ఉధృతంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వైరస్ సినీ రంగంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్ వరకూ ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ మహమ్మారి విళయతాండవం చేస్తోంది. తద్వారా కరోనా బారిన పడడం కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌కు చెందిన సీనియర్ సింగర్ మరణించారు.

  తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా కాలంగా సేవలు అందిస్తోన్న ప్రముఖ గాయకుడు జీ ఆనంద్ కరోనా కారణంగా కన్నుమూశారు. 67 ఏళ్ల ఆయన ఇటీవల ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇంట్లోనే ఉంటూ చికిత్సను తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత రాత్రి ఆయనకు ఆక్సీజన్ శాతం పడిపోతూ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే, అక్కడ ఆయనకు వెంటిలేటర్ సదుపాయం లభించలేదని.. ఈ కారణంగానే జీ ఆనంద్ కన్నుమూశారని తెలుస్తోంది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

   Tollywood Singer G. Anand Passes Away

  జీ ఆనంద్ పూర్తి పేరు గేదెల ఆనందరావు. జి ఆనంద్‌గా, రాగమాధురి ఆనంద్‌గా సినీ రంగానికి సుపరిచితులు! ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని తులగం! జీ ఆనంద్ నాన్న మంచి పౌరాణిక నటులు! శ్రీరాముడి పాత్రకు ఆ రోజుల్లో ఆయన పెట్టింది పేరు! వారి ఇద్దరబ్బాయిలు లవకుశ పాత్రలను పోషించే వారు. అలా ఆనంద్ రంగస్థల ప్రస్థానం నటుడిగా చిన్నప్పుడే మొదలయ్యింది! ఇక 1972లో పండంటి కాపురం సినిమాకు కోరస్ సింగర్‌గా సినీ నేపధ్య ప్రస్థానం మొదలయ్యింది! అమెరికా అమ్మాయి సినిమాలో ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక అనే పాట సూపర్ డూపర్ హిట్‌తో ఆనంద్ పేరు మారు మ్రోగింది. కల్పన సినిమాలో "దిక్కులు చూడకు రామయ్య" పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్! ఆమె కథ, దాన వీర సూర కర్ణ, ప్రాణం ఖరీదుతోపాటు 2500 పైగా సినిమా పాటలు పాడారు. తన కెరీర్‌లో 200 ఆల్బమ్స్ చేశారు! 1987 సంవత్సరంలో గాంధీనగర్ రెండవ వీధి సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

  సినిమా అవకాశాలు బాగా ఉన్నప్పుడే జీ ఆనంద్ రాగ మాధురి సంస్థను స్థాపించి సంగీత విభావరిలు విరివిగా నిర్వహించే వారు! అమెరికాలో నాటి, నేటి సినీ గాయకులందరినీ తీసుకెళ్లి అనేక విభావరి లతో అలరించారు. 7000 మ్యూజికల్ నైట్స్ నిర్వహించారు. షిరిడి సాయిబాబా, విష్ణు పురాణం లాంటి పలు టీవి సీరియల్స్‌కు సంగీతం అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి గాంధీనగర్‌లో స్థిర పడ్డారు. ఆయన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.

  English summary
  Gedela Ananda Rao, popularly abbreviated as G. Anand or called as Swaramadhuri, is a Telugu singer. His troupe 'Swara Madhuri' performed all over the world. He has given performances more than 6500.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X