Geetha Madhuri పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి దంపతులు.. వారసుడా? వారసురాలా?
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన గాత్రంతో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ ను తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. అయితే నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది గీతామాధురి. 2024లో వీరి పెళ్లి జరగ్గా.. వీరికి 2019లో ఆడపిల్ల పుట్టింది. అయితే ఈ జంట మరోసారి ఆనందంలో మునిగితేలిపోతుంది. దానికి కారణం వారి ఇంటికి వారసుడు రావడమే. గీతా మాధురి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
సింగర్ గీతామాధురి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరచయం అవసరం లేదు. గీతా మాధురి తెలుగులో ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ సాంగ్, మాస్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, డివోషనల్.. ఇలా ఏ పాటైనా తన గాత్రంతో మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తుంది. గీతామాధురి పాటలకు.. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతే కాదు ఆమె గాత్రానికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో ఎన్నో సాంగ్స్ పాడి టాప్ సింగర్ గా పేరు తెచ్చుకుంది.. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటికీ గీతామాధురి పాడిన పాటలు ఏదోక సందర్భంలో ఎక్కడో ఒక చోట విని మైమరిచిపోతుంటాం. తన గానంతో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ ను ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. ఇదంతా గీతామాధురి ప్రొఫిషినల్ లైఫ్.

ఇక గీతా మాధురి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ యాక్టర్ 'నందు'ని ప్రేమించి పెళ్లాడింది. నందు కూడా అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించిన విషయం తెలిసిందే. 2014లో వీరి వివాహం చేసుకోగా... ఇక వీరి వివాహ బంధానికి గుర్తుగా 2019లో ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరు పెట్టారు. ఇక తాజాగా గీతామాధురి, నందు ఆనందంలో మునిగి తేలిపోతున్నారు.
దానికి కారణం వారి ఇంటికి వారసుడు రావడమే. ఈ దంపతులు తాజాగా తమ రెండో బేబీకి ఆహ్వానం పలికారు. కొన్ని నెలలు క్రిందట గర్భం దాల్చిన గీతామాధురి.. ఇటీవలే సీమంతం వేడుకని కూడా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 10న పండంటి మగబిడ్డకు జన్మనించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తూ గీతా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ ఆమెకు నందుకు విషెష్ చెబుతున్నారు. కాగా గీతా, నందు పెళ్లి తరువాత చాలాసార్లు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఆ వార్తల్ని అసలు పట్టించుకోలేదు.. తమ దాంపత్యంతోనే అందరికి సమాధానం చెబుతూ వచ్చారు. తాజాగా వీరికి పండంటి మగబిడ్డ పుట్టడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది.


Click it and Unblock the Notifications











