Singer Mangli: బళ్లారిలో మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అసలు విషయం చెప్పిన సింగర్!

టాలీవుడ్ సింగర్ మంగ్లీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బతుకమ్మ, బోనాలు, గణేష్ చతుర్థి, సమ్మక్క సారక్క, శివుడిపై ఎన్నో పాటలు పాడి చాలా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ సినిమా సాంగ్స్ కూడా అదరగొడుతుంది. ఆమె పాడే పాటలకు యూట్యూబ్ లో అతి కొద్ది సమయంలోనే మిలియన్ల వ్యూస్ అందుకుంటాయి. మంగ్లీకి పక్క రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆమె కన్నడలో కూడా అనేక సాంగ్స్ పాడింది. అయితే ఇటీవల బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సింగర్ మంగ్లీ.

తిరుపతిలో కర్ణాటక సంగీతం..

తిరుపతిలో కర్ణాటక సంగీతం..


సింగర్ మంగ్లీగా చాలా పాపులర్ అయింది. కానీ ఆమె అసలు పేరు సత్యవతి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తండాలో పేద బంజారా కుటుంబంలో జన్మించింది మంగ్లీ. అయితే RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకుని పాటలు పాడటం నేర్చుకుంది. అదే సంస్థ ఆర్థిక సహాయంతో.. తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అలా మొదలైన ఆమె ప్రయాణం తెలంగాణలో పల్లె పాటలకు పెట్టింది పేరుగా నిలిచింది.

సినిమాల్లో కీ రోల్స్..

సినిమాల్లో కీ రోల్స్..

యాంకర్ గా సింగర్ గా పేరు తెచ్చుకుంది మంగ్లీ. ఇక రేలా.. రేలా.. రే పాటతో సెలబ్రిటీ సింగర్ గా మారిపోయింది మంగ్లీ. అనంతరం గోర్ జీవన్ అనే లంబాడీ చిత్రంలో లంబాడ ఆడ పిల్లలను కాపాడుకునే యువతిగా నటించి ఆకట్టుకుంది సింగర్ మంగ్లీ. టాలీవుడ్ సింగర్ గా ఫుల్ పాపులర్ అయిన మంగ్లీ.. స్వేచ్ఛ, గువ్వ గోరింక సినిమాలతోపాటు నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాలో కీలక పాత్ర పోషించింది.

కన్నడలోనూ పాటలు పాడిన మంగ్లీ..

కన్నడలోనూ పాటలు పాడిన మంగ్లీ..


ఇక సింగర్ మంగ్లీ ఇటీవల హీరోయిన్ గా అవకాశం కొట్టేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పాదరాయ'లో సింగర్ మంగ్లీ హీరోయిన్ గా చేయనుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను బెంగళూరులో ప్రకటించారు. ఇదిలా ఉంటే తెలుగులోనే కాకుండా కన్నడలోనూ అనేక పాటలు పాడి కన్నడీగులను అలరించింది సింగర్ మంగ్లీ.

మంగ్లీపై రాళ్ల దాడి..

మంగ్లీపై రాళ్ల దాడి..

అయితే ఇటీవల బళ్లారి ఫెస్టివల్స్ లో సందర్భంగా బళ్లారి మున్సిపల్ కళాశాల గ్రౌండ్ లో జరిగిన ఒక ఫెస్టివల్ లో మంగ్లీ పాల్గొంది. ఈ వేడుకకు పునీత్ కుమార్ భార్య అశ్విని అలాగే సీనియర్ నటుడు రాఘవేంద్ర కుమార్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత సింగర్ మంగ్లీ కారుపై గుర్తు తెలియను వ్యక్తులు రాళ్ల దాడి చేశారని సోషల్ మీడయాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అసంతృప్తి చెందిన కన్నడిగులు..

అసంతృప్తి చెందిన కన్నడిగులు..


చిక్కబళ్లాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజీపై మంగ్లీని కన్నడలో మాట్లాడాలని యాంక్ అనుశ్రీ కోరారు. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కాబట్టి తాను తెలుగులోనే మాట్లాడతానని మంగ్లీ చెప్పారట. అప్పటికీ యాంకర్ బలవంతం చేయడంతో రెండు మూడు ముక్కలు కన్నడలో మాట్లాడింది మంగ్లీ. అలా మంగ్లీ కన్నడలో మాట్లాడలేకపోవడంపై అసంతృప్తి చెందిన కొందరు కన్నడిగలు అలా చేశారని వార్తలు వచ్చాయి. ఆమె తీరుపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయాలపై తాజాగా సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది.

నేను ఎప్పటికీ రుణపడి ఉంటా..


"బళ్లారిలో జరిగిన కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను. ఈ ఈవెంట్ ఎంత గొప్పగా జరిగిందో ఆ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది. నేను పాల్గొన్న ఈవెంట్లలొ బెస్ట్ ఈవెంట్ ఇది. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కడి అధికారులు, నిర్వాహకులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది మాటల్లో చెప్పలేను. ఇదంతా నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని మంగ్లీ తను షేర్ చేసిన పోస్టులో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X