సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. టాలెంటెడ్ సంగీత దర్శకుడి మృతి!
కరోనా కష్టకాలంలోనే చాలామంది సినీ ప్రముఖులు అనారోగ్యం బారిన పడే కన్నుమూసిన విషయం తెలిసిందే. వారికి సంబంధించిన సినిమాలను చూసినప్పుడు ఒక నిమిషం వరకు వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారు అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇక ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చిన ఒక యువ సంగీత దర్శకుడు ఇటీవల హఠాత్తుగా కన్నుమూయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం మంచి ఆఫర్లతో బిజీగా మారుతున్న సమయంలోనే అతను మరణించడంతో వారి కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ విభాగంలో మంచి గుర్తింపు అందుకున్న టెక్నీషియన్లలో ప్రమోద్ కుమార్ ఒకరు. ఆయన గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ సంగీత ప్రపంచంలో కొనసాగుతూ వస్తున్నారు. చాలామంది అగ్ర సంగీత దర్శకులు వద్ద కూడా అసిస్టెంట్ గా వర్క్ చేశారు. ఇక ఆ తర్వాత సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు.

ఇటీవల వచ్చిన భారీ చిత్రాలకు కూడా అతను వర్క్ చేశాడు. ముఖ్యంగా ఎఫ్ 3 సినిమాకు కూడా అతను సౌండ్ ఇంజనీరింగ్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే అతనికి అవకాశాలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రమోద్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అవకాశం రావడం విశేషం. ఇటీవల ఆదిత్య ఓం దామిని విల్లా అనే సినిమా తెరపైకి రాబోతున్నట్లు ఒక ప్రకటన వచ్చింది. అయితే ఆ సినిమాకు ప్రమోద్ సంగీత దర్శకుడుగా సెలెక్ట్ అయ్యాడు.
ఇక ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులతో బిజీగా పాల్గొంటున్న ప్రమోద్ కు ఇటీవల హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇక ఆ తరువాత అతన్ని వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెలకినప్పటికి లాభం లేకపోయింది. హార్ట్ కారణంగానే మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చిన్న వయసులో అతను ఈ విధంగా మరణించడాన్నే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అందరిని నవ్విస్తూ తన పాటలతో ఎంతగానో అట్రాక్ట్ చేసిన ప్రమోద్ లేడు అనగానే నమ్మలేకపోతున్నామని మరికొందరు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇక ప్రమోద్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కూడా వారు నివాళులులర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











