Adipurush: ప్రభాస్ తో సరికొత్త రికార్డ్.. తెలుగులో శ్రీరాముడంటే గుర్తుకొచ్చే నటులు వీరే..

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించి మెప్పించాడు. ఈ చిత్రానికి తెలుగునాట మంచి ఆదరణ వస్తూ ఉండగా హిందీలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. తెలుగునాట మాత్రం చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓ వర్గం ప్రేక్షకులు గ్రాఫిక్స్ బాగా రాలేవు, కథనంలో ఎమోషన్ లేదు అని కామెంట్స్ చేసినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సినిమాకు ఫిదా అవుతున్నారు. మొదట గ్రాఫిక్స్ విషయంలో అభ్యంతరాలు రాగా మళ్ళీ 100 కోట్లు ఖర్చు చేసి కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్ర కూడా అద్భుతం అంటూ ఆడియెన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా మంది నటులు శ్రీరాముడి పాత్రలో నటించారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మొదట్లో ఆ మహానటులు:1932లో మొదటిసారిగా యడవల్లి సూర్యనారాయణ పాదుకా పట్టాభిషేకం అనే చిత్రంలో శ్రీరాముడిగా నటించారు. అప్పుడే తెలుగు సినిమా శకం ఆరంభమైంది. తరువాత 1945లో రంగస్థల నటులు సిఎస్ఆర్ ఆంజనేయుడు మళ్ళీ పాదుకా పట్టాభిషేకం రీమేక్ లో రాముడి పాత్రలో నటించి మెప్పించారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో శ్రీరాముడు అంటే వెంటనే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. అంతా ప్రేక్షకుల మనస్సులకి చేరువ అయిపోయారు.

Tollywood star Actors

ఐదు సినిమాలలో శ్రీరాముడిగా ఎన్టీఆర్: అయితే అందరికి శ్రీరాముడు అంటే గుర్తుకొచ్చేది మాత్రం నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఆయన ఏకంగా ఐదు సినిమాలలో శ్రీరాముడిగా కనిపించారు. వారిలో సంపూర్ణ రామాయణం, లవకుశ పెద్ద హిట్ అయ్యాయి. అలాగే శ్రీ రామాంజనేయ యుద్ధం కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ శ్రీరాముడు పాత్ర ధరిస్తే సాక్షాత్తు రాముడు అంటే ఇలాగే ఉండేవాడా అనేంతగా ఆకట్టుకునేవారు.

Tollywood star Actors

శోభన్ బాబు, సుమన్: ఎన్టీఅర్ తర్వాత శోభన్ బాబు బాపు సంపూర్ణ రామాయణం సినిమాలో శ్రీరాముడిగా నటించారు. అతను కూడా తన రూపం, నటనతో ఆకట్టుకున్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం పెద్ద హిట్ అయ్యింది. ఇక సుమన్ శ్రీరామదాసు సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించారు. అలాగే బాలకృష్ణ శ్రీరామరాజ్యం చిత్రంలో రాముడిగా నటించి మెప్పించారు. నటనతో ప్రశంసలు అందుకున్నారు.

Tollywood star Actors

శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్: ఏఎన్నార్ లీడ్ రోల్ చేసిన మొదటి సినిమా శ్రీరామ జననం సినిమాలో రాముడి పాత్రలో కనిపించి మెప్పించారు. తరువాత ఎప్పుడు దేవుడి పాత్రలో నాగేశ్వరరావు కనిపించలేదు. అలాగే హరనాథ్ సీతారామ కళ్యాణం, శ్రీరామ కథ సినిమాలలో రాముడిగా నటించి మెప్పించారు. అలాగే కాంతారావు వీరాంజనేయ చిత్రంలో శ్రీరాముడిగా నటించారు. శ్రీకాంత్ దేవుళ్ళు చిత్రంలో రాముడి పాత్రలో కొద్ది సేపు మెరిసారు. ఇక లేటెస్ట్ స్టార్ నటులలో జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంలో 2001లోనే నటించగా మళ్ళీ ఇన్నాళ్ళకు ప్రభాస్ ఆ రాముడిగా కనిపించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X