నా కర్మ..వాడు హీరోనా, కుంటిగుర్రంతో పోలుస్తూ..టాలీవుడ్ స్టార్‌పై రాజమౌళి హాట్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విస్త్రతం చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎందరో టాలీవుడ్ మార్కెట్‌ను, స్థాయిని పెంచడానికి కృషి చేశారు. అలాంటి వారిలో ఎస్ఎస్ రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా జక్కన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ ఓ క్లైమాక్స్‌లా ప్రేక్షకుడిని కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వదు.
సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలను రాజమౌళీ సమూలంగా మార్చివేశారు. పాన్ ఇండియా కల్చర్‌ను భారతదేశానికి పరిచయం చేయగా.. ఇప్పుడు ఆయన వేసిన బాటలో దక్షిణాది నుంచి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేస్తున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.

అజాతశత్రువుగా పేరున్న రాజమౌళి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఇష్టపడతారు. హీరోలు, హీరోయిన్లు కూడా ఆయన సన్నిహితంగానే ఉంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి చాలా క్లోజ్‌గా ఉంటారు. వృత్తి పట్ల ఆయన అంకిత భావం, పని రాక్షసుడిలా ఎప్పుడూ కష్టపడే రాజమౌళిని జూనియర్ సరదాగా జక్కన్న అని పిలుస్తుంటారు. కెరీర్ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎన్టీఆర్- రాజమౌళిల మధ్య ఫ్రెండ్‌షిప్ అలాగే కొనసాగుతోంది. అలాగే జక్కన్న తన కెరీర్‌లో ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్‌తోనే. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్‌లతో ఎన్టీఆర్‌కు స్టార్ స్టేటస్‌ను అందించారు రాజమౌళి.
అలాంటి ఎన్టీఆర్‌పై రాజమౌళి గతంలో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టూడెంట్ నెంబర్ 1 నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఈ మూవీతోనే జక్కన్న తెలుగు తెరకు పరిచయమయ్యారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే తొలుత ఈ మూవీలో ప్రభాస్‌ను హీరోగా అనుకున్నారు. కానీ ఈ కథను యంగ్ రెబల్ స్టార్ రిజెక్ట్ చేసినట్లుగా చెబుతారు. ఇది తెలుసుకున్న నందమూరి హరికృష్ణ స్వయంగా అశ్వినీదత్‌కు ఫోన్ చేసి తన చిన్న కుమారుడు ఎన్టీఆర్‌ను హీరోగా సిఫారసు చేశారట.
ఈ సంగతి తెలుసుకున్న రాజమౌళి.. అప్పటికీ మీసాలు కూడా సరిగా రాని ఎన్టీఆర్ కటౌట్‌ని చూసి నా కర్మకొద్ది తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంట్రా అనుకున్నాడట. అయితే పరిగెత్తే గుర్రంతో ఎవడైనా రేసులో గెలుస్తాడు.. కుంటి గుర్రంతో నెగ్గితేనే కదా అసలు మజా అని , అదే మెంటాలిటీ ఇప్పటికీ ఉందని రాజమౌళి తెలిపాడు. ఈ సూత్రంతోనే స్టూడెంట్ నెంబర్ 1ని ఎన్టీఆర్‌తోనే తెరకెక్కించి విజయాన్ని అందుకున్నట్లు జక్కన్న వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. మా హీరోని కుంటిగుర్రం అంటావా అంటూ ఫైర్ అవుతున్నారు. అప్పటి కుంటి గుర్రమే నేడు పాన్ ఇండియా హీరో అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











