హీరోగా మారబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్‌తో ఎంట్రీ.. ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది డైరెక్టర్లు తెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు. చిన్న చిన్న షాట్లలో అయినా కనిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎక్కువ సేపు కనిపించాలని కూడా చూస్తున్నారు. నటనపై ఉన్న ఆసక్తి వల్లే ఇలా చేస్తున్నారు. అలాంటి వాళ్లలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒకరు. ఓవైపు పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరికొన్నిచిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే ఇంతకాలం ముఖ్య పాత్రోల్లో మాత్రమే కనిపించిన ఈయన హీరోగా మారబోతున్నారు. అయితే ఈయన హీరోగా చేయబోతున్న సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ రెండు జాతీయ అవార్డులు అందుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. అలాగే కీడాకోలాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించారు కూడా. అయితే చేసినవి తక్కువ చిత్రాలే అయినా ఈయనకు మంచి గుర్తింపే వచ్చింది. ఓవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు నటుడిగానూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడీ యంగ్ డైరెక్టర్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన ఇప్పుడు పూర్తి హీరోగా మారబోతున్నారు.

ఇన్నాళ్లు ప్రధాన పాత్రలో మాత్రమే కనిపించిన ఈయన ఫుల్ లెంత్ హీరోగా దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే తరుణ్ భాస్కర్ హీరోగా చేయబోతున్న ఈ సినిమా... ఓ సూపర్ హిట్ మలయాళ సినిమాకు రీమేక్. దర్శన రాజేంద్రన్, ఆనంద్ మన్మథన్, బాసిల్ జోసెఫ్ లు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్ లు ఈ సినిమాను నిర్మించారు. 2022 అక్టోబర్ 28వ తేదీన థియేటర్లోల గ్రాండ్ గా విడుదల అయింది. 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద 43 నుంచి 50 వరకు వసూళ్లు రాబట్టింది.
ఇలా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాను ఓటీటీ వేదికగా కూడా విడుదల చేశారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలిసినప్పటి నుంచి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా చాలా బాగున్నప్పటికీ.. తెలుగులో కూడా అందుబాటులో ఉండడంతో.. ఇప్పటికే అందరూ చూసేశారని.. మళ్లీ ఎక్కువ మంది చూసే అవకాశం లేదని వివరిస్తున్నారు.

అదే కనుక జరిగితే తరుణ్ భాస్కర్ సినిమాకు అంతగా ఆదరణ దక్కపోవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది. అలాగే తరుణ్ భాస్కర్ హీరోగా చేయబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారనే దానిపై కూడా అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొంత కాలం గడిస్తే తప్ప ఈ రీమేక్ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారే విషయాలు పూర్తిగా తెలిసేలా లేవు.


Click it and Unblock the Notifications











