Allu Arjun: వంగా.. మైండ్ బ్లోయింగ్.. యానిమల్ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయే పెరిగిపోయింది!
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన మూవీ యానిమల్. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్నా లాంటి వారు నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలై అద్భుతమైన స్పందన అందుకుని విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ డైరెక్షన్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే తో యానిమల్ మూవీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ రిలీజై వారం రోజులు కావస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందించగా.. మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ను ప్రశంసించడంతో పాటు రరణబీర్ కపూర్ యాక్షన్ ను పొగుడుతున్నారు.
ఈ జాబితాలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటు సినిమాలో నటించిన వారి పర్ఫార్మెన్స్ పై రివ్యూ ఇచ్చాడు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ యానిమల్ సినిమాకు రివ్యూ ఇవ్వడం విశేషం. యానిమల్ మూవీ మైండ్ బ్లోయింగ్ అంటూ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ను పొగుడుతూ ట్వీట్ చేశాడు. ఏకంగా బన్నీ ఓ సినిమాపై రివ్యూ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఈ సినిమాపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. హీరోను మరీ రా గా చూపించడంతో ఒక వర్గం వారు డైరెక్టర్ పై వివిధ రకాలుగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

'యానిమల్ మూవీ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ చూసి మతి పోయింది. కంగ్రాట్స్. రణబీర్ కపూర్ జీ ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. వెరీ ఇన్‌స్పైరింగ్. మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి నాకు మాటలు రావడం లేదు. నా దృష్టిలో రణబీర్ కపూర్ అత్యున్నత స్థాయికి చేరారు. రష్మిక నువ్వు అద్భుతం. ఇప్పటివరకు ఇదే నీ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇది. ఇంకా మరిన్ని రావాల్సి ఉంది.
బాబీ డియోల్ జీ మీ పర్ఫార్మెన్స్ అందరినీ మాటలు లేకుండా చేసింది. ఈ పర్ఫార్మెన్స్ తో మీపై ఇంకా గౌరవం పెరిగింది. అనిల్ కపూర్ జీ ఇందులో మీ యాక్టింగ్ చాలా ఇంటెన్స్ గా ఉంది. మీ అనుభవమే మీరు ఏంటో చెప్పేస్తోంది. యంగ్ లేడీ త్రిప్తి దిమ్రి అందరి హృదయాలను కొల్లగొట్టేసింది. ముందు ముందు మరిన్ని కొల్లగొట్టాలని ఆశిస్తున్నా.
సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ వారి వారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాట్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మీరు మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని పరిమితులను అధిగమించారు. ఆ ఇంటెన్సిటీకి అసలేదీ సాటి రాదు. మేమందరం గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇండియన్ సినిమాను ఎలా మార్చబోతున్నాయో తెలుస్తోంది. ఇండియన్ సినిమా క్లాసిక్స్ లో యానిమల్ చేరింది' అని అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











