ఆ సూపర్ స్టార్ అంటే అంత పిచ్చా? ఏకంగా ఇంటికే నిప్పు పెట్టేసిన రవితేజ.. ఈ విషయం తెలుసా?

భారత్‌లో సినిమా ఒక మతమైతే, నటీనటులు ఇలవేల్పులు. వారికి గుడి కట్టి పూజలు చేసే పిచ్చి అభిమానులున్న సొసైటీ మనది. సమాజాన్ని అంతగా ప్రభావితం చేస్తారు కాబట్టే.. చాలామంది సినీనటులు తమ మాటలు, చేతల్ని అదుపులో పెట్టుకుంటారు. వీరి ఏ చిన్న తేడా చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమను ఏలిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వీరిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకరు.

హిందీ పరిశ్రమకు చెందిన అమితాబ్ బచ్చన్‌కు నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర హీరోల అభిమానులూ.. ఆయన ఫ్యాన్సే. సినిమాలే కాదు.. కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి షోకు వ్యాఖ్యాతగా బుల్లితెరపైనా సక్సెస్ అయ్యారు. అమితాబ్‌తో పాటు కెరీర్ ప్రారంభించిన ఎంతోమంది సినిమాలకు రిటైర్మెంట్ చెప్పేసి.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం 80 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. అది శరీరానికే కానీ, మనసుకు కాదని అమితాబ్ బచ్చన్ నిరూపిస్తున్నారు.

Tollywood star hero Ravi Teja Once Put His Living Room On Fire Because Of BigB Amitabh Bachchan

ఎన్నో కష్టాలకు ఎదురు నిలిచి, ఒకానొక దశలో చావు అంచుల దాకా వెళ్లొచ్చి అమితాబ్ పని అయిపోయింది అనుకున్న దశలో బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఎందరితో ఆదర్శం. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం అందిస్తూనే ఉంటానని అమితాబ్ చెప్పారు. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రభాస్‌తో ఢీ అంటే ఢీ అనేలా నటించారు బిగ్‌బీ. ఇందులోని అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్‌ను తప్పించి మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రకు జీవం పోశారు.

సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అమితాబ్‌కు వీరాభిమానులు. ఆయనను స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ ఒకరు. హిందీ బెల్ట్‌లో పెరగడం వల్లనో , లేక మరొకటో కానీ అమితాబ్‌ అంటే రవితేజకు విపరీతమైన ఇష్టం. కాలేజీ రోజుల్లో, కెరీర్ తొలినాళ్లలో అమితాబ్ హిందీ డైలాగ్స్‌ను చెప్పి యాక్టింగ్ చేసేవారట. సినిమాల్లో వీలైనప్పుడల్లా తన ఫ్యానిజంని చూపిస్తూనే ఉంటాడు. డాన్ శీనులో అమితాబ్ ఛాయలు కనిపిస్తాయి, ఇప్పుడు ఏకంగా తన సినిమా టైటిల్‌గా మిస్టర్ బచ్చన్ అని పెట్టుకున్నాడు.

Tollywood star hero Ravi Teja Once Put His Living Room On Fire Because Of BigB Amitabh Bachchan

అమితాబ్ బచ్చన్ మాదిరిగా తాను కూడా స్టార్ డమ్‌ను, పేరును సంపాదించాలని రవితేజ మనసులో చిన్నప్పుడే బలంగా నాటుకుపోయింది. సినిమాలపై పిచ్చితో ఒకానొక దశలో ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడట. బిగ్ బీ సినిమాల్లోని కొన్ని సీన్లను ఇంట్లో అనుకరించే రవితేజ.. ఐదేళ్ల వయసులో ఓ ప్రమాదకరమైన సీన్‌ను ఇమిటేట్ చేశాడు. ఈ క్రమంలో తన గదిలోని మంచాలకు నిప్పంటించడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇది జరిగిన సమయంలో రవితేజ తల్లి ఇంట్లో లేరట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X