బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. మరో తెలుగు నిర్మాత‌‌కు లింకు

బాలీవుడ్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో లింకులు తాజాగా టాలీవుడ్‌ను కూడా తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత మధు మంతని పేరు బయటకు రావడం తెలుగు సినిమా పరిశ్రమలో కలకలం రేపుతున్నది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో భార్య, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా మీడియాలో వెలుగు చూడటం సంచలనంగా మారింది. తాజాగా ఆమె పేరు డ్రగ్ వ్యవహారంలో రావడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్ దందాలో టాలీవుడ్ ప్రముఖుల లింకుల వ్యవహారంలోకి వెళితే..

N పేరుతో ఉన్న హీరోయిన్ ఆమె అంటూ

N పేరుతో ఉన్న హీరోయిన్ ఆమె అంటూ

బాలీవుడ్‌ డ్రగ్స్ రాకెట్‌లో టాలీవుడ్‌కు లింకులు ఉన్నాయనే విషయాన్ని ప్రముఖ జాతీయ టెలివిజన్ ఛానెల్‌ కథనాన్ని వెల్లడించింది. రియా చక్రవర్తి మేనేజర్‌ వెబ్ ఛాటింగ్‌లో D, K, S, N అనే అక్షరాలతో చాటింగ్ కనిపించడంతో అగ్ర తారలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో D అక్షరాన్ని దీపిక పదుకోన్‌గా, K అక్షరాన్ని కరిష్మాగా ఎన్సీబీ ధృవీకరించినట్టు జాతీయ టెలివిజన్లు స్పష్టం చేశాయి. అందుకు తగినట్టుగానే దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మాకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేయడంతో వారి పేర్లు దాదాపు ధృవీకరించబడ్డాయి.

టాలీవుడ్ స్టార్ హీరో భార్యకు లింకులు

టాలీవుడ్ స్టార్ హీరో భార్యకు లింకులు

ఇక రియా చక్రవర్తి మేనేజర్ జయా సహ వాట్సప్‌ ఛాట్‌లో S, N అక్షరాలను ఇంకా ఎన్సీబీ ధృవీకరించలేదు. అయితే N అక్షరం ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరో పేరు అంటూ కథనాన్ని వెల్లడించాయి. జాతీయ, చానెల్స్ మాత్రమే కాకుండా స్థానిక టీవీ ఛానెల్స్ కూడా కథనాలు వెల్లడించాయి. అయితే సంబంధిత నటి వర్గాలు స్పందించడానికి అందుబాటులోకి రాలేదు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై సదరు సీనియర్ హీరోయిన్‌ ఎలా స్పందిస్తుందనే విషయంపై మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

టాలీవుడ్ నిర్మాతకు సమన్లు

టాలీవుడ్ నిర్మాతకు సమన్లు

ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమీప బంధువు, నిర్మాత మధు మంతెన పేరు కూడా బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌‌లో వెలుగు చూసింది. ఎన్సీబీ అధికారులు ఇప్పటికే ఆయనకు సమన్లు జారీ చేశారు. మధు మంతెన బుధవారం అంటే సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు హాజరుకానున్నారు.

డ్రగ్ కేసులో హైదరాబాదీ అమ్మాయి పేరు

డ్రగ్ కేసులో హైదరాబాదీ అమ్మాయి పేరు

ఇక హైదరాబాదీ అమ్మాయి, బాలీవుడ్ హీరోయిన్‌ దియా మిర్జా పేరు కూడా బాలీవుడ్ డ్రగ్స్ దందాలో వెలుగు చూసింది. దియా మేనేజర్ తన బాయ్‌ఫ్రెండ్, డ్రగ్స్ సప్లయ్‌దారు నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేసిందనే ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే వారిద్దరికి త్వరలోనే సమన్లు జారీ చేస్తాయనే ఊహాగానాలు జాతీయ మీడియాలో వెలుగుచూశాయి.

Recommended Video

Maguva Actresses About Love, Boy Friends & Marriage
తనపై వచ్చిన కథనాలను ఖండించిన దియా మిర్జా

తనపై వచ్చిన కథనాలను ఖండించిన దియా మిర్జా

తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్ దియా మిర్జా స్పందించారు. తనపై వస్తున్న వార్త కథనాలను ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా స్పందిస్తూ... నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం, ఉద్దేశపూర్వకంగా చేసినవే అని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు నేను అలాంటి నిషేదిత డ్రగ్స తీసుకోలేదు. ఓ పౌరురాలిగా ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని దియా మిర్జా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X