సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి.. కదిలిస్తున్న దర్శకుల మాటలు, హీరోల ఎమోషనల్ కామెంట్స్

గాన గంధర్వుడు అనే పదం SP బాలసుబ్రహ్మణ్యం ముందు చాలా చిన్నదవుతుందేమో. ఆయన చూడని కీర్తి లేదు. అనుభవించని ప్రేమ లేదు.SPB మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఎంతగానో కదిలిస్తోంది. ఆయన ఒక సాధారణ సెలబ్రెటీ అయితే ఈ స్థాయిలో ఎవరు బాధపడరు. ఆయన ఒక శిఖరం. ప్రతి ఇంట్లో మనిషిలాగా బాలు మా వాడు అనేలా బాషాభేదం లేకుండా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న స్టార్ హీరోలు హీరోలు దర్శకులు సంగీత దర్శకులు గాయకులు ఇతర టెక్నీషియన్స్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరు వారి బాధను తెలుపుతున్నారు.

ఒక లెజెండ్ ని కోల్పోయాము: వెంకటేష్

ఒక లెజెండ్ ని కోల్పోయాము: వెంకటేష్

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మరణించిన వార్త వినడానికి చాలా బాధగా ఉంది. మేము ఈ రోజు ఒక లెజెండ్ ని కోల్పోయాము. ప్రేమా, పవిత్ర బంధం వంటి నా ఉత్తమ సినిమాల్లో అయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. మీమ్మల్ని మరచిపోలేము సార్. SPB కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం.. అని అన్నారు.

అన్నయ్య గానం అలానే ఉంటుంది: కమల్ హాసన్

అన్నయ్య గానం అలానే ఉంటుంది: కమల్ హాసన్

కమల్ హాసన్ కూడా బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త విని ఎంతో బాధకు లోనయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది అనగానే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలును కమల్ ఒక అన్నయ్యలాగా బావిస్తారు. ఇక ట్విట్టర్ లో ఈ విధంగా వివరణ ఇచ్చారు. అన్నయ్య చిరస్థాయిగా ఆయన గొంతుతో బ్రతికే ఉంటారు. ఏడు తరాల జెనరేషన్స్ కి ఆయన ఎంతో స్పూర్తిని ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు.

సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి: కె.రాఘవేంద్రరావు

సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి: కె.రాఘవేంద్రరావు

నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి. రాగాలన్నీ మూగబోయాయి. నువ్వు లేని లోటు తీర్చలేనిది.. అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. రాఘవేంద్ర రావు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి సినిమాలో బాలు గారు వారి గాత్రాన్ని అంధించారు.

చాలా బాధాకరం: కళ్యాణ్ రామ్

చాలా బాధాకరం: కళ్యాణ్ రామ్

గాన గాంధర్వ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు 13 కు పైగా భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలకు తన సుమధుర స్వరం తో ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం! అని వివరణ ఇచ్చారు.

ఆగిపోయింది మీ గుండె మాత్రమే

ఆగిపోయింది మీ గుండె మాత్రమే

ఆగిపోయింది మీ గుండె మాత్రమే మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు ఉంటారు కూడా అంటూ దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇవ్వగా హీరో నారా రోహిత్ ఈ విధంగా స్పంధించారు. మీరు లేకున్నా మీ గాత్రం మాతోనే ఉంటుంది...ఓం శాంతి !! గానగాంధర్వుడు బాలసుబ్రమణ్యం గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు.

నా గండే బద్దలైంది: నాని

నా గండే బద్దలైంది: నాని

ఒక మిలియన్ పాటలను విన్న నా గుండె బడ్డలైంది. నేను ఒకరోజు నా భార్య అంజుకు కొడుకు జున్నును షూటింగ్ కి రమ్మని చెప్పాను. అప్పుడు నేను బాలు గారుతో షూటింగ్ చేస్తున్నప్పుడు. లెజెండ్ తో ఒక ఫొటో కావాలని నా భార్య అడిగింది. అప్పటి ఫొటో ఇది అటు... సంగీతం జీవించినంత కాలం ఆయనకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయని నాని వివరణ ఇచ్చారు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
వరుణ్ తేజ్, సాయి తేజ్ ట్వీట్స్

వరుణ్ తేజ్, సాయి తేజ్ ట్వీట్స్

నిజంగా నా గుండె బద్దలైంది. బాలు సార్ చిత్ర పరిశ్రమకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు .. మీ స్వరం ద్వారా ఎప్పటికీ బ్రతికే ఉంటారని మెగా హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్ స్పందిస్తు.. మమ్మల్ని నవ్వించే స్వరం, మమ్మల్ని కేకలు వేయించింది, మీరు ఎప్పటికీ మాతో జీవిస్తారు, కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X