Samantha Ruth Prabhu: కొత్త బిజినెస్‌లోకి సమంత.. ఇండస్ట్రీకి షాకిచ్చిన హీరోయిన్!
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అంతకు మించిన అభినయం కలగలిపిన ఈమె.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో నటనను కనబర్చి అనేక హిట్లు కొట్టింది. అయితే గతకొంత కాలంగా మయోటైటిస్ వ్యాధితో బాధ పడుతున్న ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓ కొత్త బిజినెస్ స్థాపించి అందరికీ షాకిచ్చింది. అయితే ఆమె చేస్తున్న కొత్త బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ... రెమ్యునరేషన్ పుచ్చుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వచ్చేసింది. అందేంటీ అంటారా.. అవునండి. ఆమె కొత్తగా ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా నిలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే ఓ ప్రొకడక్షన్ హౌస్ ప్రారంభించిన సమంత అదే విషయాన్ని సోషల్ మీడియా వేధికగా వెల్లడించింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన కొత్త బిజినెస్ చెప్పడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రారంభించింది.

తన కొత్త ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రకటించడం తనకు చాలా ఆనందంగా అనిపిస్తోందని.. ట్రాలాలా అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు పేర్కొంది. ముఖ్యంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంగ్లీష్ పాప్ సాంగ్.. బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ లోని లిరిక్స్ లో వచ్చే ట్రా లా లా అనే పదాన్ని తీసుకుని ఈ పేరు పెట్టినట్లు స్పష్టం చేసింది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్థవంతమైన, ప్రమాణికమైన, విశ్వజననీయమైన కథల్ని ఈ వేధికపై నిర్మించబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేధికగా వివరించింది. సమంత చేసిన ఈ పోస్టుకు నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.
హీరోయిన్ గా ఎంత గుర్తింపు పొందావో.. ప్రొడ్యూసర్ గా కూడా అంతకు మించిన పేరు తెచ్చుకోవాలని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. కంగ్రాట్స్, అభినందనలు అంటూ మరికొంత మంది సామ్ అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. కేవలం నటనా రంగంలోనే కాకుండా ప్రొడక్షన్ రంగంలో కూడా వెలుగొందాలని ట్రా లా లా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సమంతకు మీరూ కంగ్రాట్స్ చెప్పేసేయండి.

మయోటైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సామ్... శాకుంతలం, ఖుషీ వంటి సినిమాలకు బ్రేకులు ఇస్తూ చాలా ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసింది. అయితే ఆమె ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా.. అది కూడా చాలా ఆలస్యంగా షూటింగ్ పనులు చేసుకుంటుంది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న సామ్.. సిటాడెల్ కోసం విపరీతంగా కష్టపడుతోంది. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందనేది.


Click it and Unblock the Notifications











