అందరి చూపు ఆ పండగ వైపే.. హీరోల మధ్య కొట్లాట తప్పేలా లేదు?

చిన్న సినిమలైనా పెద్ద సినిమలైనా మంచి సమయాన్ని చూసుకొని వస్తేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ప్రమోషన్స్ కరెక్ట్ గా చేసి హాలిడేస్ సమయంలో సినిమాలను రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ ని స్ట్రాంగ్ గా అందుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా వరకు పెద్ద సినిమాలు పండగ సమయాల్లోనే వస్తున్నాయి.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
 కరోనా దెబ్బకు..

కరోనా దెబ్బకు..

కరోనా దెబ్బకు రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. చిన్న సినిమాలు కొన్ని OTT ఫ్లాట్ ఫార్మ్ లో ఎంతో కొంత లాభాల్ని అందుకోవాలని రిలీజ్ చేయగా మరికొన్ని సినిమాలు ఆలస్యం అయినా పరవలేదని రిలీజ్ తేదీలను వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

సమ్మర్ మిస్..

సమ్మర్ మిస్..

సమ్మర్ హాలిడేస్ లో చాలా సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా నిర్మాతలకు చేదు అనుభవమే మిగిలింది. ఇక లాక్ డౌన్ అనంతరం వెంటనే రిలీజ్ చేయాలనీ కొందరు వెయిట్ చేస్తుంటే.. మరికొందరు పరిస్థితులను బట్టి రిలీజ్ చేయాలని రిలీజ్ డేట్ ని పెండింగ్ లో పెట్టారు. ఒకవేళ సరైన సమయం దొరికితే వారం గ్యాప్ లోనే 10కి పైగా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందట.

దసరా టార్గెట్..

దసరా టార్గెట్..

ఇక దసరాకు సినిమాలను రిలీజ్ చేయాలని కొంతమంది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా ఆ పండగకే రానున్నాయి. మెగాస్టార్ 'ఆచార్య'. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రజినీకాంత్ 'అన్నాత్తే', KGF 2, కంగనా రనౌత్ 'తలైవి', వంటి సినిమాలతో పాటు వరుణ్ తేజ్ బాక్సర్, నితిన్ రంగ్ దే సినిమాలు దసరాను టార్గెట్ చేశాయి.

 హీరోల బాక్సాఫీస్ కొట్లాట..

హీరోల బాక్సాఫీస్ కొట్లాట..

విజయదశమి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న హీరోల మధ్య బాక్సాఫీస్ కొట్లాట తప్పేలా లేదు. అయితే లాక్ డౌన్ కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ కి మరింత సమయం పట్టె అవకాశం ఉంది. దీంతో కొన్ని సినిమాలు ఆ విధంగా దసరా నుంచి డ్రాప్ కావచ్చు. ఏదేమైనా దసరా భరిలో ఈ సారి హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X