సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దిల్‌రాజు హాట్ కామెంట్స్ .. వీడియో వైరల్

దేశంలో సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమీషన్ ప్రకటించగా.. ఇప్పటికే కొన్ని దశల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 2తో అన్ని విడతల పోలింగ్ పూర్తవుతుండగా.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇక రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా కలిపి ఇరు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. పోలింగ్ ముగియడంతో జనం చూపు ఫలితాలపై పడింది.

tollywood star producer dilraju sensational comments on election results at Love Me trailer launch event

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నేసి స్థానాల్లో విజయం సాధిస్తాయోనని జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరోసారి అధికారాన్ని అందుకోవాలని జగన్, ఈసారి పవర్ కైవసం చేసుకోవాలని విపక్షాలు ఎన్నికలను ఎదుర్కొన్నాయి. దీంతో ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది..? పవన్ పిఠాపురంలో గెలుస్తారా.. నారా లోకేష్ పరిస్థితేంటీ.? అంటూ చర్చలతో పాటు పందెలు జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఫలితాలపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ''లవ్ మీ '' మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఫలితాల కోసం జూన్ 4 వరకు వెయిట్ చేయాలని, కానీ లవ్ మీ యూనిట్ మాత్రం మే 25 వరకు వెయిట్ చేస్తే చాలన్నారు. మా బ్యానర్‌లో ఇప్పటి వరకు 10 మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశామని.. కానీ తొలిసారిగా ప్రొడ్యూసర్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని దిల్‌రాజు చెప్పారు.

నాగ, అరుణ్ ఇద్దరూ మంచి స్క్రిప్ట్‌తో నా దగ్గరకి వచ్చారని .. రాత్రి 10.30 వరకు కూడా షాట్, స్క్రిప్ట్ వర్క్ గురించి చర్చించుకునేవాళ్లని దిల్‌రాజు ప్రశంసించారు. వారి హార్డ్ వర్క్‌ మీరు చూసిన ట్రైలర్, పాటల్లో కనిపిస్తుందని తెలిపారు. లవ్ మీ ని కొత్తగా ఫీల్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్‌ అయిన ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్‌లు ఈ సినిమా కోసం పనిచేశారని దిల్‌రాజు తెలిపారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దెయ్యంతో ప్రేమాయణం అనే కాన్సెప్ట్‌తో 'లవ్ మీ 'ని తెరకెక్కించారు. అందరినీ చంపేసే ఓ దెయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్లే హీరో.. దానిని ఎలా ప్రేమలో పడేస్తాడు.. దెయ్యం వల్ల హీరో ఎదుర్కొన్న పరిణామాలను ట్రైలర్‌తో చూపించారు. హార్రర్, లవ్, రొమాంటిక్ జానర్‌లో ఈ సినిమా ఉండబోతోంది. సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X