కిక్, టెంపర్ రైటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. మళ్ళీ అల్లు అర్జున్ కోసమే వెయిట్ చేస్తున్నాడా?

సినిమా రచయితలకు ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోల నుంచి మంచి గౌరవం దక్కుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కథలు అందిస్తూ కెరీర్ ని కొనసాగిస్తూ ఉంటారు. చాలా వరకు మంచి కథలు రాస్తే.. సినిమా సక్సెస్ కాకపోయినా కూడా హీరోలు మరోసారి నమ్మడానికి ముందుకు వస్తారు.. ఇక మొన్నటివరకు కిక్ రైటర్ కెరీర్ కూడా అలానే ఉండేది.

 స్టార్ రైటర్..

స్టార్ రైటర్..

కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి బాక్సాఫీస్ కథలను రాసిన వక్కంతం వంశీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలతో టాప్ రైటర్ గా ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. చాలా మంది హీరోలు వరుస అపజయాలు ఎదురైనప్పుడు వంశీని కలిసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలకు అతని ఆలోచన విధానం కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి.

దర్శకుడిగా ఫెయిల్..

దర్శకుడిగా ఫెయిల్..

కిక్ 2 సినిమా ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో వక్కంతం వంశీ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. దర్శకుడిగా వేసిన మొదటి అడుగు దారుణంగా విఫలమైంది. అల్లు అర్జున్ తో చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ రిజల్ట్ అనంతరం ఆ కాన్సెప్ట్ అభిమానుకు అంచనాలను అందుకోలేకపోయింది.

ఇప్పుడు ఏం చేస్తున్నాడు..

ఇప్పుడు ఏం చేస్తున్నాడు..

అలాంటి స్టార్ రైటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలైతే గీత ఆర్ట్స్ సంస్థలోనే కొత్త తరహా కథలను వింటూ అనలిస్ట్ గా వర్క్ సిచేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం టాక్ వచ్చింది. మంచి కథలను జడ్జ్ చేస్తూ గీత ఆర్ట్స్ బ్యానర్ లో గుర్తుండిపోయే కథలు తెరకెక్కేలా వర్క్ చేస్తున్నాడట.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
బన్నీతో మరో ప్లాన్..

బన్నీతో మరో ప్లాన్..

వక్కంతం వంశీ అంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికి కథలు అడిగే హీరోలు ఉన్నారు. కానీ అతను మాత్రం డైరెక్షన్ వైపే చూస్తున్నాడు. మరో కథ రాయమని చెబితే.. నెక్స్ట్ కూడా మరో సినిమాకు డైరెక్షన్ చేద్దామని అనుకుంటున్నట్లు హీరోలకు సమాధానం ఇస్తున్నాడట. ఇకపోతే వంశీ మరో డిఫరెంట్ కథ అందిస్తే తప్పకుండా మరో అవకాశాన్ని ఇవ్వాలని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. అయితే మొదటి సినిమా ప్లాప్ కావడంతో బన్నీ అతనికి మరో అవకాశం ఇస్తున్నారు అనే విషయం నమ్మబుద్ది కావడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X