K. Viswanath గురించి రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం.. రాజమౌళి, పవన్, కమల్ హాసన్ నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిస్తున్నాయి. కె.విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ప్రత్యేకంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో సినిమా నటులు దర్శకులు ఆయన గొప్పతనం గురించి వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

రొమ్ము విరిచి గర్వంగా

ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు సినిమా, కళపై మీ సంతకం ఎప్పటికీ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము సార్.. అని దర్శకుడు రాజమౌళి నివాళులర్పించారు.

పవన్ కళ్యాణ్ నివాళి

పవన్ కళ్యాణ్ విశ్వనాథ్ పార్థివదేహానికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు త్రివిక్రమ్ కూడా కలిసి వచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. శంకరాభరణం సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటల ద్వారానే సంస్కృతి గొప్పతనం ఏంటో తెలిసింది. ఆయన పాటలు సినిమాలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.

మీ రుణం తీర్చుకోలేనిది: నాని

నాచురల్ స్టార్ నాని కూడా కె విశ్వనాథ్ మృతి పై సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు. సినిమా అనేది బాక్సాఫీస్ కంటే పెద్దది సినిమా అనేది తారల కంటే మెరుగైనది. సినిమా అనేది ఏ వ్యక్తికైనా పైచేయి. ఇది మాకు ఎవరు నేర్పించారు? అంటే.. గొప్ప కె.విశ్వనాథ్ గారు అంటూ.. మీ రుణం తీర్చుకోలేనిది అని నాని నివాళులర్పించారు.

సినిమాకు చాలా గర్వకారణం: బాలకృష్ణ

సినిమాకు చాలా గర్వకారణం: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ కూడా కె.విశ్వనాథ్ మృతి పై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ముఖ్యంగా మన తెలుగుదనాన్ని జోడించి అణువణువునా ప్రతిబింబించేలా చేసిన గొప్ప దర్శకుడు అంటూ.. ఆయన తెలుగు సినిమాకు చాలా గర్వకారణం అన్నారు.

ఇక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ తెలుగువారికి గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడు అని ఆయన మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని అన్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

కమల్ హాసన్ ఎమోషనల్

కమల్ హాసన్ కూడా సోషల్ మీడియాలో కళాతపస్వి కె విశ్వనాథ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. కళ అనేది సజీవమైనది అంటూ అజరామరమైనది అని దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమంది గొప్ప వ్యక్తులలో కె.సిశ్వనాథ్ ఒకరు. ఇక ఆయన చేసిన కళా సేక ఎప్పటికీ మరువలేనిది. ఆయన తదనంతరం కూడా అది బ్రతికే ఉంటుంది.. నేను అయితే ఆయనకు ఇప్పటికీ అభిమానిని అంటూ కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.

తుఫానులో ప్రశాంతంగా ఉండే వ్యక్తి

కె.విశ్వనాథ్ గారు ఒక లెజెండ్. ఒక వ్యక్తి తన సొంత మార్గంలో తన కళ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయన ఆలోచన అద్భుతం. ఒక లక్ష్యంతో సినిమాలు తీశారు. తుఫానులో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అంటూ రాధికా శరత్ కుమార్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.

నందమూరి రామకృష్ణ నివాళి

నందమూరి రామకృష్ణ నివాళి

కళాతపస్వీ దర్శకేంద్రులు, నటులు సంగీత దర్శకులు, కే.విశ్వనాధ్ గారు స్వర్గస్తులవ్వటం మన యావత్ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. వారు సంగీత సాహిత్యానికి విలువనిచ్చే గొప్ప మనిషి. వారు ఎన్నో చారిత్రాత్మక చిత్రాలకు జీవమిచ్చిన గొప్ప దర్శకేంద్రులు కే.విశ్వనాధ్ గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబానికి మా సంతాన్ని తెలియచేస్తున్నాము.. అంటూ నందమూరి రామకృష్ణ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X