twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sirivennela సీతారామశాస్త్రికి టాలీవుడ్ హీరోల నివాళి.. కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ

    |

    ఓడిపోయే వాడు కూడా పోరాడాలి అనేలా బలాన్ని ఇచ్చే విధంగా పాటలు రాయగల అతి కొద్దిమందే గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. సీనియర్ దర్శకుల నుంచి నేటి తరం యువ దర్శకులు వరకు కూడా అందరు కూడా ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఒక శిష్యుడు తరహాలో ఉంటారు. సిరివెన్నెల అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సరస్వతి పుత్రుడు అంటూ గురువుగా ఆప్యాయంగా భావిస్తారు. ఇక కడసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన పార్ధివ దేహాన్ని ఉంచారు.

    త్రివిక్రమ్ కంటతడి

    సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రభుత్వ ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా చూసుకుంటున్నారా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక జరిగిన పరిణామాలపై కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టాలీవుడ్ సినీ ప్రముఖులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక సిరివెన్నెల మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. హాస్పిటల్ నుంచి ఆయన కంటతడి పెట్టుకుంటూ వచ్చినా విజువల్స్ కూడా సోషల్ మీడియాలో షాక్ కు గురిచేశాయి.

    నివాళులర్పించిన హీరోలు

    ఇక సిరివెన్నెల మృతికి టాలీవుడ్ హీరోలు ప్రత్యేకంగా నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నాని, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రానా దగ్గుబాటి.. అందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ లోని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.

    మొదటిసారి నిద్రపోవడం చూస్తున్నాను


    సింగర్ సునీత కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన చనిపోలేదు అంటూ మొదటిసారి నిద్రపోవడం చూస్తున్నాను అని అన్నారు. ఎన్నోకలలతో ఆలోచనలతో బిజీగా ఉండే సిరివెన్నెల గారు మృతి చెందారు అంటే నమ్మలేకపోతున్నా అని అన్నారు. ఎంఓ పదాలకు అర్థాలు చెబుతుంటారు. మహానుభావుడు చరిత్ర సృష్టించి మెల్లగా నిద్ర లోకి జారుకున్నారు.. ఆయన చీకటిని మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు సునీత వివరణ ఇచ్చారు.

    అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం..

    అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం..


    సిరివెన్నెలకు నిర్మాత అల్లు అరవింద్ తో పాటు ఆయన తనయుడు అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ సిరివెన్నెల గారు ఒక సరస్వతి దేవి పుత్రుడు అంటూ మొన్నటి వరకు కూడా ఎన్నో పాటలను రాశారు అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు కూడా పాటలు రాసినట్లు గుర్తు చేసుకున్నారు. వేటూరి మరణంతో ఒక శకం ముగిసింది.. సిరివెన్నెల మరణం తర్వాత మరో శకం ముగిసింది అన్నారు. ఇక అల్లు అర్జున్ కు సిరివెన్నెల అంటే ఎంతో ఇష్టం అంటూ.. బన్నీతో ఆయన గంటల తరబడి మాట్లాడేవారు అని అన్నారు.

    కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ


    సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని చూసిన నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టుకోవడంలో అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఇది ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అని అన్నారు. తెలుగు సాహిత్యానికి భాషకు కూడా సిరివెన్నెల ఒక భూషణుడు అని తను పుట్టిన నెలకి వన్నెతెచ్చిన మహానుభావుడు అని అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరు అనగానే ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో కి వెళ్ళిపోయింది. చాలా సందర్భాల్లో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇక పుట్టినవారు గిట్టక తప్పదు కానీ సిరివెన్నెల గారు 66 ఏళ్ల కి వెళ్లారు.. అని బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.

    హీరో వెంకటేష్ ఎమోషనల్

    హీరో వెంకటేష్ కూడా సిరివెన్నెల గారి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఎంతో బాధాకరం అంటూ సిరివెన్నెల గారు చాలా మంచి వ్యక్తి అని వివరణ ఇచ్చారు. స్వర్ణకమలం నుంచి నారప్ప వరకు సిరివెన్నెల గారు నాతో పని చేశారు. ఆయనతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. సాహిత్య రంగంలో ఆయనను కోల్పోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని వెంకటేష్ కోరుకున్నారు.

    English summary
    Tollywood stars nani balakrishna and other celebrities pays tribute Sirivennela Sitaramasastri,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X