twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Super Star Krishna Funeral: తండ్రి చితికి నిప్పటించిన మహేష్.. కృష్ణ అంత్యక్రియలు పూర్తి

    |

    టాలీవుడ్ లెజండ్, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి చెందడం సినిమా పరిశ్రమను మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. ఇక ఆయన అంతిమయాత్రలో చాలామంది అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు ముగిశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    ఘనంగా నివాళులు

    ఘనంగా నివాళులు

    తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం తెలుగు చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇక ఆయన మరణించిన విషాదాన్ని ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకువెళ్లిన ఆయనకు సినీ ప్రముఖులందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు.

    అంతిమయాత్రలో ప్రముఖులు

    అంతిమయాత్రలో ప్రముఖులు

    మంగళవారం రోజు తెల్లవారుజామున సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఆయన అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగింది. ఈ అంతిమయాత్రలో ఎంతోమంది అభిమానులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా కృష్ణ గారి పాడెను మోశారు.

    చితికి నిప్పటించిన మహేష్

    చితికి నిప్పటించిన మహేష్

    కొద్దిసేపటి క్రితమే తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మహేశ్ బాబు తండ్రి కృష్ణ చితికి నిప్పటించారు. మహేష్ బాబు కొన్ని వారాలా క్రితమే తన తల్లికి అంతిమ సంస్కరణలు నిర్వహించాడు. ఇక ఆ గాయం నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మళ్లీ తండ్రికి కూడా తుది వీడ్కోలు పలికారు. ఒక విధంగా అభిమానులను కూడా ఈ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా తన తండ్రికి చివరిసారిగా తుది వీడుకోలు పలికారు.

    సెలవంటూ వీడ్కోలు

    సెలవంటూ వీడ్కోలు

    అంతకుముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా వేలాదిమంది అభిమానులు పాల్గొన్నారు. కడసారి తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక సెలవంటూ వీడ్కోలు పలికారు. సూపర్ స్టార్ కృష్ణ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలు సినిమా పరిశ్రమ బ్రతికున్నంత కాలం కూడా గుర్తుండిపోతుంది అని పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

    వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ..

    వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ..

    గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కృష్ణ సోమవారం రోజు హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆయనను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ గుండెపోటు తరువాత పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. ఇక మంగళవారం రోజు కృష్ణ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసింది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు.

    English summary
    Tollywood super star krishna funeral completed and mahesh emotional situation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X