Zubeda Ali: అలీకి రెండో పెళ్లి కూడా జరిగిందా.. షాకింగ్ విషయాలు చెప్పిన జుబేదా!
టాలీవుడ్ టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అలీ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా చక్కగా సాగిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా తన జీవితాన్ని సాగిస్తున్న అలీ గురించి ఆయన భార్య జుబేదా అలీ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన భర్త రెండో పెళ్లి గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కమెడియన్ గానే కాకుండా టీవీ వ్యాఖ్యాతగా కూడా పని చేశాడీ టాలెంటెడ్ నటుడు. ఇప్పటి వరకు మొత్తం 1100లకు పైగా చిత్రాల్లో నటించిన ఈయన బాల నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టాడు. 1968లో జన్మించిన ఈయన ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా 1981లో సీతాకోక చిలుక సినిమాతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి వరుసుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసు కల్గిన ఈయన 43 ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నాడు.

అయితే కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అలీకి పెళ్లి చేసేసింది ఆయన తల్లి. అయితే ఆమెకు ఓ అమ్మాయి బాగా నచ్చగా.. తనే నా కోడలు కావాలని పట్టు బట్టిందట. అలాగే వాళ్లు కూడా అలీ గురించి తెలుసుకుని వెంటనే పెళ్లికి ఓకే చెప్పేయడంతో త్వరగానే పెళ్లి జరిగిందట. అలా పెళ్లై అత్తారింటికి వచ్చిన జుబేదా అలీ తన భర్తతో ఎక్కువ సమయం గడపాలని కళలు కనేదట. అప్పటి వరకు తాను సినీ రంగంలోని వ్యక్తులను చూడకుండా ఉండడం.. కనీసం తనకు అవగాహన లేకపోవడంతో ఆయన ఎక్కువగా షూటింగ్ కు వెళ్తే చాలా బాధ పడేదట.
ముఖ్యంగా వాళ్ల పెళ్లి అయ్యాక తొలి రంజాన్ పండుగకు అత్తగారింటికి తీసుకు వెళ్లారట. కానీ తనతో వచ్చినట్లే వచ్చిన భర్త... షూటింగ్ ఉందని ఫోన్ చేసిన వెంటనే వెళ్లిపోయాడట. అది చూసిన తాను చాలా బాధపడి గుక్కపెట్టి మరీ ఏడ్చిందట. అసలు పండుగపూట తన భర్త తనతో ఉండకుండా ఇలా వెళ్లిపోవడాన్ని అస్సలే జీర్ణించుకోలేకపోయిందట. అలాగే తన బంధువులు కూడా ఇలా వెళ్లిపోయాడేంటని చాలా విడ్డూరంగా చూశారట. ఇదే సమయంలో తన తండ్రికి ఎవరో తన భర్త అలీ రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పారట.

దీంతో తన తల్లి, తండ్రి విపరీతంగా ఏడ్చారట. ఆ విషయాన్ని తనకు చెప్పకుండా.. వెంటనే నిన్ను మీవారు తీసుకురమ్మన్నారంటూ అలీ ఇంటికి తీసుకెళ్లారట. అయితే రైలు దిగి వెళ్తుండగా.. ఆటోలో ఉన్నప్పుడు తన తండ్రి నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నారని, నీవు మాత్రం ఆయనతోనే ఉండాలని చెప్పారట. కోపంతో ఆయనను అస్సలు దూరం చేసుకోకని వివరిస్తూ.. విపరీతంగా ఏడ్చారట. తనకు కూడా చాలా భయం వేసిందట. ఇక ఇంట్లోకి రాగానే అలీ రెండో భార్య గురించి ఇళ్లంతా వెతికిందట. కానీ ఎవరూ కనిపించకపోయేసరికి అసలు విషయం అర్థం అయిందట. ఆ తర్వాత అదే విషయం తన భర్తను అడగ్గా.. అదేం లేదని షూటింగ్ ఉండడం వల్లే తాను అక్కడ నుంచి వచ్చేసినట్లు వివరించారట.


Click it and Unblock the Notifications











