సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ టాప్ ఫోక్ సింగర్.. నెట్టింట వీడియో వైరల్.. మీరూ చూశారా!
తెలంగాణ జానపద కళాకారుడు, పల్సర్ బైక్ సింగర్ రేలా రమణ గురింతి తెలుగు సినీ ప్రేక్షకులకు, తెగులు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాటతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈయన అతి తక్కువ కాలంలోనే అందరికీ తెలిసిపోయాడు. ఆ తర్వాత ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో పాల్గొని అందులో పాల్గొన్న అమ్మాయిల మీద పాట పాడి మరింత క్రేజ్ సంపాధించుకున్నాడు. అద్భుతమైన గొంతుతో అందరినీ అలరించే ఈయన... తాజాగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎవరికీ తెలియకుండానే పెళ్లి కాగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
2023 డిసెంబర్ నెలలో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఇతడు.. నిశ్చితార్థం అయ్యే వరకూ ఎవరికీ తెలియనివ్వలేదు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్యే ఈ వేడుక చేసుకున్నాడు. అయితే కొత్త ఏడాదిలోనే పెళ్లి జరుగుతుందని అందరికీ తెలిసినా దాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు. పెళ్లి డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈయన తన పెళ్లి వీడియోను పోస్ట్ చేసి మరోసారి షాక్ ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోలో నూతన వధూవరులు ఇద్దరూ అందంగా ముస్తాబై అదిరిపోయారు. నిజంగా వీరి పెళ్లి వేడుక చూసేందుకు రెండు కళ్లూ సరిపోవట్లేదంటూ అతిశయోక్తి కాదు. పెళ్లి కొడుకు, పెల్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి హల్దీ, పెళ్లి రోజు ముందు జరిపే అన్ని వేడుకలను ఈ వీడియోలో చూపించారు. అలాగే అందరూ మెచ్చే పెళ్లి పందిరిలో చూడముచ్చటైన జంటగా కనిపించి మెస్మరైజ్ చేశారు. ఈ వీడియో కోసం ఓ అద్భుతమైన పాటను కూడా పెట్టగా.. ఆ వీడియో మరింత అద్బుతంగా కనిపిస్తోంది.
సింగర్ రమణా చేసుకోబోయే ఈ అమ్మాయి పేరు కుందన శ్రీ. పేరుకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ కుందనపు బొమ్మలా ఉంది. శివపార్వతుల్లా పట్టు బట్టలు కట్టుకున్న ఈ జంట.. అందరి ముందు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ముఖ్యంగా సింగర్ రమణ కుందన శ్రీ మెడలో మూడు ముళ్లు వేస్తుంటే ఆమె తగె సంబుర పడిపోతూ కనిపించింది జీవితాంతం గుర్తిండిపోయే ఈ క్షణాలను సింగర్ రమణ మరింత అద్భుతంగా మార్చుకున్నాడు. ఆమె నుదిటిపై ముద్దు పెడుతూ మరింత మురిసిపోయాడు. అచ్చమైన తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకను మీరు కూడా ఓసారి చూసి ఎంజాయ్ చేసేయండి.
గతంలో బేబీ సినిమా రేంజ్ బ్రేకప్ స్టోరీ కల్గిన రమణ.. పెళ్లి చేసుకోవడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ దీవిస్తున్నారు. అలాగే వీడియో అదిరిపోయిందని.. కొత్త జంట కూడా చాలా చూడ ముచ్చటగా ఉందని చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











