రోజా నీవు డైమండ్ రాణివి.. ఎన్నికల తర్వాత వాళ్లకు పులుసు వండిపెట్టాల్సిందే.. బండ్ల గణేష్ ఫైర్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఈయన ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఓ వైపు సినిమాలు నిర్మిసూతనే మరోవైపు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు, ఏపీలో జనసేనకు సపోర్ట్ చేస్తున్న ఈయన ఏపీ మంత్రి ఆర్కే రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమె ఒక ఐటం రాణి, డైమండ్ రాణి అంటూ నోరు పారేసుకున్నారు. ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మంత్రి ఆర్కే రోజా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేశారు. ఆయన యాక్సిడెంటల్ సీఎం అంటూ తెలిపారు. అయితే తాజాగా బండ్ల గణేష్.. మంత్రి రోజా చేసిన కామెంట్లపై స్పందించారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని.. ఆమె ఎవరి దగ్గర అయితే పని చేస్తుందో ఆ ముఖ్యమంత్రియే యాక్సిడెంటల్ సీఎం అంటూ వివరించారు. అంతేకాకుండా.. రోజా గురించి చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులు అడగగానే.. ఆమె గురించి ఏం చెప్తాం అంటూనే షాకింగ్ కామెంట్లు చేశారు.

Tollywood Top Producer Bandla Ganesh Fires on Minister Roja Check Details

ముఖ్యంగా "మంత్రి ఆర్కే రోజా ఓ డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం.. ఆమెకు అసలు సీట్ వస్తుందో రాదో కూడా తెలియదు" అంటూ బండ్ల గణేష్ తెలిపారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని.. ఆయన ఓ పోరాట యోధుడు అని చెప్పుకొచ్చారు. ఆయన ఓ ఫైటర్ అని ఇలి పోరాట యోధులు భారత దేశంలో చాలా తక్కువ మంది ఉంటారని వివరించారు. పోరాడి, కష్టపడి, తానేంటో నిరూపించుకుని సీఎం అయ్యారని అన్నారు. అలాగే యాక్సిడెంటల్ సీఎం అంటే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారి వారసత్వం చెప్పుకుంటేనో.. లేదా నీలాగా పులుసు వండిపెడితోనే వస్తుందంటూ సైటర్లు వేశారు.

నువ్వు పులుసు వండిపెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు అంటూ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపోమాపో నువ్వు మాజీ అయిపోతావని అన్న ఆయన.. ఆ మాజీ, ఈ మాజీ కలిసి రేపు ఇక్కడకు వచ్చి జబర్దస్త్ షో చేసుకుంటారని చెప్పారు. అలాగే పగలు జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకుని పులుసు వండుకుని పెట్టుకోండి అంటూ కామెంట్లు చేశారు. అంతేకానీ మా ముఖ్యమంత్రిని అనే స్థాయి నీది కాదమ్మా అంటూ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tollywood Top Producer Bandla Ganesh Fires on Minister Roja Check Details

నువ్వు ఐటెం రాణివి, ఐటెంలాగే ఉండు అంటూ మంత్రి ఆర్కే రోజాపై బండ్ల గణేష్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం బండ్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బండ్ల గణేష్ మరీ ఈ స్థాయిలో ఓ మహిళా మంత్రిపై వ్యాఖ్యలు చేయడంపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతలా దిగజారి తిట్టుకోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X