అరే దిల్ మామా మస్త్ అమ్మాయిని పట్టినవ్ లే.. రెండో భార్యపై ట్రోల్స్.. దిల్‌రాజు రియాక్షన్ ఏంటంటే?

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్న ఈయన.. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈక్రమంలోనే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన రెండో భార్య వైగా రెడ్డిపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. సినీ రంగంపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలిసారి దిల్ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. తన తొలి సినిమా పేరును తన పేరులో పెట్టేసుకున్నారు. అలా దిల్ రాజుగా మారాడు వెంకట రమణా రెడ్డి. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలను నిర్మిస్తూ.. కెరియర్ లో సక్సెస్ ఫుల్ దిశగా అడుగులు వేస్తున్నారు.

Tollywood Top Producer Dilraju Shocking Comments About Trolls on His Second Wife Check Details

ప్రొఫెషనల్ లైఫ్ లో అద్భుతంగా ముందుకు వెళ్తున్న ఈయన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలానే మిస్ అయ్యారు. ముఖ్యంగా ఈయన మొదట అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కూతురు పుట్టింది. ఆమె పేరే హన్షిత. అయితే ఈమె పెద్దది కావడం పెళ్లి కూడా జరగడం అయ్యాకా.. అంటే 2017లో ఈయన భార్య అనిత చనిపోయింది. ఆ తర్వాత మూడేళ్లు ఒంటరిగా జీవించిన ఈయన కూతురు సపోర్ట్ తో రెండో పెళ్లి చేసుకున్నాడు. ముఖ్యంగా నిజామాబాద్ లోని ఓ గుడిలో వైగారెడ్డిని (తేజస్విని) రెండో వివాహం చేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం 53 ఏళ్ల వయసు ఉన్న ఈయన 2020లో రెండో పెళ్లి చేసుకున్నారు. అంటే ఆయనకు 49 ఏళ్ల వయసు ఉండగా.. తన కూతురుకు పెళ్లై పిల్లలు కూడా పుట్టాకా ఈయన.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి. అరే దిల్ మామా మంచి అమ్మాయినే పట్టావని కొందరు, కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లెలా చేసుకున్నావంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఈయన పెళ్లి వీడియోల కింద అయితే వరుసగా ఇలాంటి కామెంట్లు వచ్చాయని తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tollywood Top Producer Dilraju Shocking Comments About Trolls on His Second Wife Check Details

అయితే తాను మొత్తం ఓ కోటి మందికి పైగా తెలిసి ఉంటే.. నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేసిన వాళ్లు వందల్లో మాత్రమే ఉన్నారని అన్నారు. అలాంటి వారికోసం తాను బాధ పడి.. ముందుకెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఏడిస్తే తాను సక్సెస్ సాధించలేకపోయేవాడినని దిల్ రాజు వివరించారు. తన రెండో భార్యపై ఎన్ని కామెంట్లు, ట్రోల్స్ చేసినా తాను పట్టించుకోనని.. ప్రస్తుతం చాలా హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X