Dilraju: సినిమాల్లోకి దిల్‌రాజు కొడుకు.. రెండేళ్లు రాకముందే కెరియర్ సెట్.. ఏం కాబోతున్నాడో తెలుసా?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన.. దిగ్గజ నిర్మాతగా టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. అయితే ఎప్పుడూ టీవీ షోలకు రాని ఈయన తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ షోకు వచ్చారు. తన ఏడాదిన్నర వయుసున్న బాబును కూడా తీసుకు రాగా.. అతడి గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈషోలోనే దిల్ రాజు కొడుకు అన్వి రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, ఎలాంటి కెరియర్ ఎంచుకోబోతున్నారో వివరించారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. అయితే సినీ రంగంలోకి అడుగు పెట్టాకా ఆయన తొలిసారి దిల్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. సినిమా పేరునే తన పేరులో పెట్టుకున్నాడు. అలా వెంకట రమణా రెడ్డి కాస్త దిల్ రాజు గా మారిపోయారు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థతో అద్భుతమైన సినిమాలు చేస్తూ.. అత్యున్నత శిఖరాలకు ఎదిగారు. ఇప్పటికీ అనేక భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు.

Tollywood Top Producer Dilraju Son Anvy Reddy Coming into Film Industry Check Details

ఇలా కెరియర్ లో దూసుకు పోతున్న ఈయన ఫ్యామిలీ లైఫ్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు మొదట అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి హన్షిత పుట్టింది. ఆమె పెద్దది అయి పెళ్లి కూడా చేసుకోగా.. 2017లో ఈయన భార్య అనిత చనిపోయింది. ఆ తర్వాత మూడేళ్లు ఒంటరిగా జీవించిన ఈయన 2020 లాక్‌డౌన్‌ సమయంలో నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని (తేజస్విని) రెండో వివాహం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు.

అయితే వైగారెడ్డి, దిల్ రాజు దంపతుల అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా... 2022 జూన్ 29న ఓ కొడుకు పుట్టాడు. ఆయనకు అన్వీ రెడ్డి అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంకా రెండేళ్ల వయసు కూడా నిండని ఈ బాబును తాజాగా ఓ షోకు తీసుకుని వచ్చాడు దిల్ రాజు. ఎప్పుడూ టీవీ షోలకు రాని ఈయన.. ముఖ్యంగా భార్యా, కొడుకును తీసుకుని రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మా ఇంటి పండగ అనే షోకు ఫ్యామిలీ స్టార్ చిత్రబృందంతో పాటు దిల్ రాజు ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈక్రమంలోనే గ్రాండ్ గా వీరికి వెల్ కమ్ చెప్పారు.

Tollywood Top Producer Dilraju Son Anvy Reddy Coming into Film Industry Check Details

ఇక వెంటనే యాంకర్ శ్రీముఖి.. మీరు దిల్ రాజు గారిని ప్రేమగా ఏమని పిలుస్తారని వైగారెడ్డిని అడిగింది. ఆమె తెగ సిగ్గు పడిపోతూ... జానూ అంటానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బాబు అన్వీ రెడ్డికి అన్నప్రాశన రోజు చేయించే ఓ చిన్న పని చేయించారు. ముఖ్యంగా బాబు ఎదురుగా ఓ మెగా ఫోన్, మేకప్ కిట్, డబ్బులు పెట్టి.. ఏం అవుతాడో అని చూశారు. ఈక్రమంలోనే బాబు వెళ్లి మేకప్ కిట్ పట్టుకోగా.. అతడు హీరో కాబోతున్నాడంటూ శ్రీముఖి చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా తెగ సంబురపడిపోయారు. ముఖ్యంగా దిల్ రాజు, ఆయన భార్య అయితే మరింత మురిసిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X