ఆ స్టార్ హీరో ప్రేమలో సింగర్.. లవ్ అఫైర్‌ను బయటపెట్టిన గాయని!

టాలీవుడ్ టాప్ సింగర్ గా కొనసాగుతున్న సింగర్ శ్వేతా మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతైమన గాత్రంతో అదిరిపోయే పాటలు పాడి.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ క్యూట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో వస్తున్న సూపర్ సింగర్ షోలో జడ్జిగా చేస్తూ అందరినీ అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తాను పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి ఓ స్టార్ హీరోను ప్రేమిస్తున్నట్లు వివరించింది. అయితే ఆయన ఎవరు, ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సింగర్ శ్వేతా మోహన్.. భారతీయ నేపథ్య గాయని. ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా 4 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా 4 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఒకటి కాగా.. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం మరోటి. అయితే ఈమె తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలకు పాటలకు పాడింది. ఇలా కెరియర్ లో దూసుకు వెళ్తున్న ఈమె తెలుగులో సూపర్ సింగర్ షోలో జడ్జిగా చేస్తోంది.

Tollywood Top Singer Sweta Mohan Reveal Her Crush Name Check Details

ముఖ్యంగా శ్వేతా మోహన్, అనంత శ్రీరామ్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ లు... టీం లీడర్లుగా, జడ్డిలుగా వ్యవహరిస్తూ ఈ షో చేస్తున్నారు. ఇలా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా శ్వేతా మోహన్ బాబా తెలిసిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పటికే పెళ్లి అయి, పిల్లలు కూడా ఉన్న ఈమె.. ఆ స్టార్ హీరోనే తన గుండె అంటూ చెప్పి షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా తాను పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి ఆయనను ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని.. ఆయనంటే పిచ్చి ప్రేమ అని వివరించింది. తన ఫస్ట్ క్రష్ కూడా ఆయనే అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆయన మరెవరో కాదు.. హీరో మాధవన్. హీరో మాధవన్ కు అతిపెద్ద అభిమాని అయిన ఈమె.. ఆయన తన గుండె అని కూడా వెల్లడించింది. ఇప్పటికీ ఆయనంటే తనకు పిచ్చి ప్రేమ అని తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఆయనను కలిసే అవకాశం రాలేదని వెల్లడించింది.

Tollywood Top Singer Sweta Mohan Reveal Her Crush Name Check Details

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వంటి వాళ్లందరినీ కలిసిన తన అభిమాన హీరోను మాత్రం ఇప్పటికీ కలవలేకపోయానని సింగర్ శ్వేతా మోహన్ క్లారిటీ ఇచ్చింది. ఇంత పెద్ద సింగర్ అయి ఉండి కూడా ఇప్పటికీ తనకు ఆ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుస్తానని.. తాను పదో తరగతి నుంచి ఆయనను ఆరాధిస్తున్న విషయం చెబుతానని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X