RRR ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.. ఎన్ని రోజులు తరువాతే అంటే..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం వెండి తెర పైకి తీసుకు వస్తున్న ఈ విజువల్ వండర్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీలో రాబోతోంది అనే విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.

వెయ్యి కోట్ల టార్గెట్..

వెయ్యి కోట్ల టార్గెట్..

దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద అంతకుమించి అనేలా విజయాన్ని అందుకుంటూ ఉంటాడు అని చెప్పవచ్చు. ఈసారి ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించారు ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తప్పకుండా సినిమా వెయ్యి కోట్లకు పైగా టార్గెట్ ను చాలా ఈజీ గా అందుకుంటుందని సినీ ప్రముఖులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు.

 బలమైన నమ్మకం

బలమైన నమ్మకం

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్ కనిపించబోతుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అలరించబోతున్నాడు. మొట్టమొదటిసారి మెగా నందమూరి వారసులు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అంతకుమించి అనేలా అంచనాలు పెరిగిపోతున్నాయి. తప్పకుండా సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని గట్టి నమ్మకం అయితే ఉంది. ముఖ్యంగా సినిమా ట్రైలర్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

90 రోజుల తరువాత ఓటీటీలో

90 రోజుల తరువాత ఓటీటీలో

ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీపై కూడా ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చేశారు. RRR ఆన్‌లైన్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ముందుగానే గుడ్ న్యూస్ చెప్పేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసిన 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు చిత్ర పంపిణీదారులు ప్రకటించారు. ఈ చిత్రం అన్ని భాషల్లో జనవరి 7, 2022న థియేటర్లలోకి రానుంది.

ఏప్రిల్ లోనే..

ఏప్రిల్ లోనే..


RRR స్ట్రీమింగ్ హక్కులను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు ZEE5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ జయంతి లాల్ గడా ఈ విషయాన్ని ప్రకటించారు. చిత్రం యొక్క డిజిటల్ విడుదల గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు, RRR యొక్క థియేట్రికల్ విడుదల తర్వాత సినిమా స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి రావడానికి కనీసం 90 రోజులు వేచి ఉండవలసి ఉంటుందని గదా సమాధానం ఇచ్చారు. అంటే సినిమా 2022 ఏప్రిల్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X