twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోదీ బయోపిక్ తీస్తా.. 60 వేల మందికి ఉపాధి కల్పిస్తా.. రేసుగుర్రం విలన్

    |

    ప్రధాని నరేంద్రమోదీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే మరో ప్రయత్నం మొదలైనట్టు కనిపిస్తున్నది. గతంలో వివేక్ ఒబేరాయ్ మోదీ బయోపిక్‌ను తెరకెక్కించగా.. అంతగా ప్రజాదరణ పొందలేకపోయిన విషయం తెలిసిందే. తాజాగా రేసుగుర్రం లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన రవి కిషన్ తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ సారి హిందీలో కాకుండా భోజ్‌పురి భాషలో తీయాలని ఉందని మనసులో మాట బయపెట్టాడు. నటుడు రవికిషన్ ఇటీవల బీజేపీలో చేరి గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

    నేను మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చాను. నా తల్లి, చెల్లి, ఇతరులు అనారోగ్యంతో బాధపడటం చూశాను. అలాంటి ఎన్నో సమస్యలను కళ్లారా చూశాను. కానీ బీజేపీ ప్రయత్నం వాటిని దూరం చేసేందుకు విశేష కృషి చేస్తున్నది. భారత్ మాతా కీ జై అనే నినాదం దేశవాసులందరినీ ఏకం చేస్తున్నది. అందుకు మోదీ చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిది అంటూ రవికిషన్ పేర్కొన్నారు.

    Tollywood villain Ravi Kishan Wants to Make Biopic on Narendra Modi

    దేశంలోనే ఎన్నో సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నదని, 370 ఆర్టికల్ రద్దు సాహోసోపేతమైన నిర్ణయం అని అన్నారు. ప్రజా సేవ చేస్తూనే సినిమాలో నటిస్తాను. కానీ డ్యాన్స్, పాటలు తరహా పాత్రలు చేయకుండా సీరియస్ పాత్రలు చేస్తానని చెప్పారు. మోదీ, స్వామి వివేకానంద లాంటి ప్రముఖుల జీవితాలను భోజ్‌పురి భాషలో నిర్మించాలని అనుకొంటున్నాను అని రవికిషన్ చెప్పారు.

    భోజ్‌పురి సినిమా రంగంపై 60 వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వారందరూ పొట్ట చేతపట్టుకొని ముంబైకి వెళ్తున్నారు. అలాంటి వారికి ఉపాధి లభించేలా భోజ్‌పురి సినిమాలు నిర్మిస్తాను అని రవికిషన్ వెల్లడించారు.

    సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఎంపీగా దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా చిత్రంలో రవికిషన్ నటిస్తున్నాడు. సైరా అక్టోబర్ 2వ తేదీన విడుదల కానున్నది.

    English summary
    Tollywood villain Ravi Kishan Wants to Make Biopic on Prime Minister Narendra Modi in Bhojpuri language. Now He has acted sye raa, which is prestegious project for Mega star Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X