టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ .. పుష్ప 2 వసూళ్ల విషయంలో "ఫైటర్" దర్శకుడు కౌంటర్స్
కొన్ని దశాబ్దాల క్రితం వరకు భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమానే అని అంతా అనుకునేవారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా చాలా మంది పాశ్చాత్య దేశస్తులు ఇండియా నుంచి ఏ సినిమా వెళ్లినా మొదట అది హిందీ సినిమానే అని అనుకుంటారు. అలా బాలీవుడ్ ముద్ర వేసుకోగా అలాంటి హిందీ సినిమా కోటలను దెబ్బకొట్టిన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది ముమ్మాటికీ మన తెలుగు సినిమానే అని చెప్పాలి.
మకుటం లేని మహరాజులా పీఠం మీద ఉన్న హిందీ సినిమాకి పోటీ ఇవ్వడమే కాకుండా మార్కెట్ లో బాలీవుడ్ సినిమాని బీట్ చేసేసి ఇండియన్ సినిమా దగ్గర టాలీవుడ్ సినిమానే నెంబర్ 1 అనిపించుకుంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ మన తెలుగు సినిమాల డామినేషన్‌ని చూపిస్తున్న నేపథ్యంలో హిందీ నుంచి చాలా మంది హీరోలు అలాగే నిర్మాతలు కూడా తెలుగు సినిమా పట్ల తెలుగు హీరోల పట్ల కొంచెం గుస్సా గానే ఉన్నారు.

వాతావరణం ఇంత హీట్‌గా ఉన్న పరిస్ధితుల్లో ఇపుడు మరింత లెవెల్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్లుగా మారింది. హిందీ సినిమా నుంచి బోనీ కపూర్ తో మన తెలుగు నిర్మాత నాగవంశీ చేసిన హీట్ కన్వర్జేషన్ ఓ రేంజ్ లో చర్చకి దారి తీసింది. అయితే నాగవంశీ.. హిందీలో పుష్ప 2 సింగిల్ డేలో రూ.80 కోట్లకి పైగా రాబట్టడంతో ముంబైలో చాలామందికి నిద్ర పట్టడం లేదు అన్న అర్ధం వచ్చేలా చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ దర్శకులు కూడా దీనిపై హర్ట్ అయ్యినట్టే కనిపిస్తుంది. బాలీవుడ్ సినిమాలో బ్యాంగ్ బ్యాంగ్, పఠాన్ లేటెస్ట్ గా ఫైటర్ లాంటి సినిమాలను అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు రంగంలోకి దిగాడు. నిజానికి ముంబై బాంద్రాలో నివసించే వారికి ముంబైలో రాత్రి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.
ముంబై అనేది అసలు నిద్రే తెలియని సిటీ అంటూ ఇన్ డైరెక్ట్ గా నాగవంశీ కామెంట్స్ పై సెటైర్స్ వేసాడు. ఇంకా మన ముంబై గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అంటూ కూడా నైస్ గా చురకలు అంటించారు. దీంతో రచ్చ మాత్రం టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్టే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తెలుగు ఆడియెన్స్ కూడా సిద్ధార్థ్ ఆనంద్‌కి కౌంటర్లు కూడా వేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్‌ను తెలుగు సినిమా కొట్టిన దెబ్బ చాలా ప్రభావం చూపించింది. మొన్న పుష్ప 2 వసూళ్లు చూసి హిందీ ట్రేడ్ పండితులు మొత్తం షాకయ్యారు. హిందీ మార్కెట్ లో ఊహించని వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రికార్డులు చూసి అంతా స్టన్ అయ్యారు. మరి ఇప్పటికీ రన్ ని కొనసాగిస్తుండగా వీటిని కొట్టగలమా అని బాలీవుడ్ లవర్స్ మీమాంసలో కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











