ఫోర్జరీ, చీటింగ్ కేసులో సినీ నటుడు అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

ఫోర్జరీ, చీటింగ్ వ్యవహారాల విషయంలో వర్థమాన నటుడు, హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్న నవీన్ రెడ్డి అట్లూరి కటకటాల పాలయ్యాడు. N Square కంపెనీ సహా డైరెక్టర్లకు కుచ్చు టోపి పెట్టి ఆరోపణలపై సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డి అరెస్ట్ వివరాల్లోకి వెళితే..

Naveen Reedy Atluri

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెంకు చెందిన నవీన్ రెడ్డి జల్సాలు, నో బడీ అనే సినిమాల్లో నటించాడు. ఆయనపై గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఎన్ స్వ్కేర్ కంపెనీలో నవీన్ రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరించారు. కంపెనీలో సహ డైరెక్టర్లకు తెలియకుండా సంస్థ ఆస్తులను తాకట్టు పెట్టారనే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఫోర్జరికి ప్రయత్నించి.. కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకొన్నారనే విషయం బయటకు పొక్కడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 55 కోట్లకుపైగా రూపాయల మోసానికి పాల్పడినట్టు ఎన్ స్వ్కైర్ డైరెక్టర్లు ఆరోపించారు. దాంతో కేసు నమోదు చేసి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నవీన్ రెడ్డిని రిమాండ్‌పై చర్లపల్లి జైలుకు తరలించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X