థియేటర్ల వద్ద ఫ్లాప్ అయినా అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టు.. ఏ సినిమానో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల రిజల్ట్స్ తేడా కొట్టేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తుండగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రాలే ఎక్కువ. అయితే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయిన ఓ సినిమా థియేటర్లలో విడుదల అయి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. డిజాస్టర్ కావడమే కాకుండా.. అనేక విషయాల్లో ట్రోలింగ్స్ కు కూడా గురైంది. కానీ తాజాగా ఈ సినిమా ఓ చోట సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన హీరోగా చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్టుగా నిలవలేదు. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన స్కంధ సినిమా ఫ్లాప్ అయింది. ది గ్రేట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. కానీ ఈ చిత్రం మాత్రం థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

పైగా ఈ సినిమాలోనే అనేక సీన్లపై పెద్ద ఎత్తున రచ్చ సాగింది. ఫైట్ సీన్లపై అయితే విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ పోతినేని సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను.. సెప్టెంబర్ 28వ తేదీన తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేశారు.

అయితే థియేటర్ల వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా నవంబర్ 2వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలో కూడా అంతంత మాత్రమే టీఆర్పీని సొంతం చేసుకున్న ఈ సినిమా.. టెలివిజన్ ప్రీమియర్ లో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించిన స్టార్ మాలో ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇలా దీనికి 8.4 రేటింగ్ వచ్చింది. గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమా కూడా థియేటర్ల వద్ద ప్లాప్ అయినా.. టీవీల్లో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











