పెళ్లికి సిద్దమైన ప్రభాస్ దర్శకుడు.. డేట్ ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి. త్వరలో మరొక సినీ ప్రముఖుడు కూడా పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సమ్మర్ లోనే సినీ స్టార్స్ కి సంబంధించిన పెళ్లి వేడుకలు జరగడం విశేషం. త్వరలోనే సాహో దర్శకుడు సుజిత్ కూడా తన ప్రేయసిని పెళ్లాడబోతున్నాడు. నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి వేడుకలు..
ఇటీవల కాలంలో సినీ హీరోలతో పాటు ఒక నిర్మాత దిల్ రాజు కూడా పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. రానా, నితిన్ ఎంగేజ్మెంట్ లతో సిద్ధమవ్వగా యువ హీరో నిఖిల్ లాక్ డౌన్ ఉండగానే సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సాహో దర్శకుడు సుజిత్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

సుజిత్ కూడా..
రన్ రాజా సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన సుజిత్ చిన్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 24 ఏళ్లకే మెగా ఫోన్ పట్టిన సుజిత్ ఆ తరువాత ప్రభాస్ తో సాహో సినిమా ద్వారా బంపర్ ఆఫర్ అందుకున్నాడు. అతి చిన్న వయసులోనే 350కోట్ల బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

లవ్ మ్యారేజ్..
ఇకపోతే ఫైనల్ గా 29 ఏళ్ళ వయసులో ఈ దర్శకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. గత కొంత కాలంగా సుజిత్ ప్రవళిక అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె హైదరాబాద్ కి చెందిన అమ్మాయే అని తెలుస్తోంది. సుజిత్ ఫ్యామిలీకి ప్రవళిక ఫ్యామిలీ సన్నిహితులట. ఇక మొత్తానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది
Recommended Video

డేట్ ఫిక్స్..
సాహో షూటింగ్ సమయంలోనే సుజిత్ పెళ్లిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఫైనల్ గా జూన్ 10న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి డేట్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. పరిస్థితులను బట్టి తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











