డ్రగ్స్ కేసులో తెరపైకి పలువురు సినీ తారల పేర్లు.. లావణ్య అరెస్ట్‌తో కదులుతున్న డొంక!

తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్న యువతి లావణ్య, ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్‌తో మరోసారి టాలీవుడ్ ఉలిక్కి పడింది. మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె వద్ద నుంచి నార్సింగి పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఆమెను రిమాండ్‌కు తరలించారు. అయితే తాజా విచారణలో ఇద్దరి నుంచి పలు విషయాలపై ప్రశ్నిస్తూ డ్రగ్స్ దందాకు సహకరిస్తున్న వారు, అలాగే వారి కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నార్సింగి ప్రాంతంలో ఉంటున్న లావణ్య డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నదనే సమాచారంతో ఆ ప్రాంత పోలీసులు నిఘా పెట్టారు. తమకు లభించిన సమాచారంతో ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి వద్ద 4 గ్రాములు ఎండీఎంఎస్ డ్రగ్స్ లభించినట్టు తెలిసింది. ఆమె వద్ద లభ్యమైన డగ్స్‌ను సీజ్ చేసి ప్రశ్నించారు.

Tollywood Young Hero Lover Arrested in Drugs Case: More Film Actors names surfaced in Police investigation

అయితే పోలీసు అధికారుల విచారణలో ఉనీత్ రెడ్డి అనే డ్రగ్ పెడ్లర్ నుంచి కొనుగోలు చేసినట్టు లావణ్య చెప్పారు. దాంతో ఉనీత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని ఆయనను విచారించగా పలు విషయాలను వెల్లడించారు. ఇద్దరు తెలిపిన సమాచారం మేరకు నార్సింగి పోలీసుల విచారణ జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా, లావణ్య, ఉనీత్ రెడ్డిని విచారించడం పూర్తయిన తర్వాత కొందరు సినీ, రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరి కాల్ డేట్, వాట్సప్ ఛాట్‌లో వెల్లడైన విషయాలను బట్టి మరికొందరిని విచారించేందుకు సిద్దమవుతున్నారు.

Tollywood Young Hero Lover Arrested in Drugs Case: More Film Actors names surfaced in Police investigation

ఇదిలా ఉంటే.. లావణ్య విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలో ఓ యువ హీరోకు ప్రేయసి అనే విషయం బయటకు వచ్చింది. అయితే ఆ హీరో రాజ్ తరుణ్ అని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. లావణ్య విషయంలో రాజ్ తరుణ్‌కు సంబంధం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ విషయంలో రాజ్ తరుణ్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X