Naga Shourya Marriage: పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న హీరో నాగ శౌర్య.. అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ హీరో నాగ శౌర్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగానే అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. అతని ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్లికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇక మొత్తానికి నాగశౌర్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఆ అమ్మాయి ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ గా మారుతున్నాయి. నాగశౌర్య పెళ్లికి ముహూర్తంతో పాటు వేదిక కూడా ఫిక్స్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి పనుల్లో బిజీగా

పెళ్లి పనుల్లో బిజీగా

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాగశౌర్య రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డీసెంట్ టాక్ ను అందుకుంది. ఇక నాగశౌర్య వెంటనే మరొక రెండు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టాడు. అయితే గత కొన్ని రోజుకుగా నాగశౌర్య అతని పెళ్లికి సంబంధించిన పనులలో కూడా బిజీగా మారిపోయాడు.

కొన్నాళ్లు మౌనంగానే..

కొన్నాళ్లు మౌనంగానే..

నాగశౌర్య గత ఏడాది నుంచి పెళ్లి చేసుకోవాలని తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదివరకే సైలెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతని పెళ్లికి సంబంధించిన వార్తలు బయట వైరల్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్దగా అఫీషియల్ గా ప్రకటించింది లేదు. చాలా వరకు నాగశౌర్య ఆ విషయంలో కొన్నాళ్లు మౌనంగానే ఉన్నాడు.

తెలుగమ్మాయితో పెళ్లి

తెలుగమ్మాయితో పెళ్లి

అయితే ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో మొత్తానికి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది చివరలో తాను పెళ్లి చేసుకోబోతున్నాను తను అచ్చమైన మన తెలుగు అమ్మాయి అని కూడా వివరణ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అతని పెళ్లికి సంబంధించిన వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

ముహూర్తం ఫిక్స్

ముహూర్తం ఫిక్స్

ఇక నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతొంది. నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వధువు పేరు అనూష. బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్ లోని జెడబ్ల్యూ మారియోట్ హోటల్లో వీరి వివాహం జరగబోతోంది.

ఆ అమ్మాయి ఎవరంటే?

ఆ అమ్మాయి ఎవరంటే?

ఇక నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అనూష, నాగశౌర్య కుటుంబ సభ్యులకు అతి దగ్గర బంధువు అని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమెతో ప్రేమలో ఉన్న నాగశౌర్య పెద్దల అభిప్రాయంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే నాగశౌర్య నుంచి కూడా ఈ విషయంలో అధికారికంగా ఒక ప్రకటన రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X