Nikhil Siddhartha: ప్రభాస్ ఫ్యాన్స్కు హీరో నిఖిల్ బంపర్ ఆఫర్.. అర్ధరాత్రి తనతో వచ్చేదెవరంటూ పోస్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రం సలార్ గురించి అందిరకీ తెలిసిందే. టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుంటూ రచ్చ రచ్చే చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన రాబోతున్న ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాకుండా టాప్ హీరోలు కూడా ప్రభాస్ సినిమా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఈ సినిమా చూసేందుకు వేచి చూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులకు ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సలార్ చిత్రాన్ని హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ అండ్ టాప్ నటులు జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా కనిపించబోతున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఈ సినిమాతోనే హిట్టు కొడతాని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంపై హీరోతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

 Tollywood Young Hero Nikhil Siddharth Giving 100 Free Tickets For Salaar Movie Check Details

అయితే అన్ని సినిమాలలాగా ఉదయం పూట రాకుండా ఈ చిత్రం అర్ధరాత్రే విడుదల కాబోతుంది. డిసెంబర్ 21వ తేదీన అర్ధ రాత్రి 1 గంటలకు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. అయితే ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలని ఫిక్స్ అయిన వారంతా రాత్రంతా కూర్చొని సినిమా చూడాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను చూసేందుకు వెళ్లకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా హీరో నిఖిల్ కూడా అర్ధరాత్రి సలార్ సినిమా చూసేందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు.

 Tollywood Young Hero Nikhil Siddharth Giving 100 Free Tickets For Salaar Movie Check Details

అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కు అదరిపోయే ఆఫర్ ఇచ్చారు. అర్ధరాత్రి శ్రీరాములు థియేటర్ లో తాను సినిమా చూసేందుకు వెళ్తుండగా.. తనతో పాటు వచ్చేదెవరని ప్రశ్నించారు. తనతో పాటు థియేటర్ కు వచ్చి సలార్ చూసే వాళ్లకు 100 టికెట్లు ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కు మాత్రమే తాను ఈ టికెట్లు ఇస్తానని అన్నారు. అంతేకాకుండా పదేళ్ల క్రితం ఇదే థియేటర్ లో అర్ధరాత్రి ఒంటిగంటకు మిర్చి సినిమా చూశానని.. మరోసారి సలార్ తో ఆ హిస్టరీని రిపీట్ చేయబోతన్నట్లు తెలిపాడు. హీరో నిఖిల్ సిద్దార్థ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు నిఖిల్ తో కలిసి సలార్ చూసేందుకు వస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 Tollywood Young Hero Nikhil Siddharth Giving 100 Free Tickets For Salaar Movie Check Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X