లేడీ ప్రొడ్యూసర్, టాప్ హీరోయిన్ డిష్యూం డిష్యూం.. రెమ్యునరేషన్ విషయంలో గొడవతో...
సినిమా ఇండస్ట్రీలో సినీ తారలకు, నిర్మాతలకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడం సర్వసాధారణంగా జరిగే విషయాలు. గతంలో ఎన్నోసార్లు రెమ్యునరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న హీరో, హీరోయిన్లు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిన సంఘటనలు తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌లో ఓ లేడీ ప్రొడ్యూసర్, టాప్ హీరోయిన్‌కు మధ్య పారితోషికం విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ వివారాల్లోకి వెళితే.....

క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించుకొనేందుకు
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత వారసత్వంతో ఇప్పుడిప్పుడే నిర్మాతగా నిలదొక్కుకొంటున్న నిర్మాత ఓ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఆ చిత్రం కోసం టాప్ హీరోయిన్‌ను సంప్రదించారు. కథకు సంబంధించిన విషయంలో సంతృప్తి చెందిన ఆ హీరోయిన్ నటించడానికి మాట రూపంలో ఒకే చెప్పిందట.

పారితోషికంపై బేరసారాలు
అయితే టాప్ హీరోయిన్ ఒకే చెప్పిన తర్వాత పారితోషికం విషయంలో వారి మధ్య చర్చ జరిగిందంట. ముందుగా చెప్పిన మొత్తం కాకుండా తగ్గించి బేరసారాలు ఆడటంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని, ఆ తర్వాత వారి మధ్య చర్చలు కొద్ది వారాలపాటు కొనసాగయనేది సినీ వర్గాల సమాచారం.

హీరోయిన్ అసంతృప్తితో
ఆ తర్వాత నిర్మాత, హీరోయిన్ మధ్య చర్చలు ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో వారి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. దాంతో నిర్మాతపై అసంతృప్తితో హీరోయిన్ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. తన స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను సినిమా చేయనని ముఖంపైనే చెప్పింది అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

నిర్మాత తీవ్రంగా హర్ట్
ఇదిలా ఉండగా, హీరోయిన్ చేసిన నిర్వాకంతో మహిళా నిర్మాత హార్ట్ అయ్యారని, ప్రస్తుతం పెద్దగా చేతిలో ప్రాజెక్టులు లేని హీరోయిన్ ఇలా డిమాండ్ చేయడం ఏమిటి అనే వాపోయిందంట. అయితే తనతో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత దారుణంగా వ్యవహరించిందని ఓ మాస్ హీరో వద్ద హీరోయిన్ తన గొడవను చెప్పుకొన్నారంట. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











